ETV Bharat / state

రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్లే! - ఇక 2025లోనే సర్పంచ్​ల ఎన్నిక? - Local Bodies Elections Issue - LOCAL BODIES ELECTIONS ISSUE

Local Bodies Elections Issue : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కొంత ఆలస్యంగా జరిగే అవకాశముంది. కులగణన చేపట్టిన అనంతరమే ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఓ సభలో పేర్కొన్నారు. కులగణన ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాపై గణాంకాలు తీసి రిజర్వేషన్ల నిర్ధారణ అనేది సుదీర్ఘ కసరత్తుతో పాటు కొంత సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ 2025లోనే జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Local Bodies Elections Issue
Local Bodies Elections Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 7:02 PM IST

Local Bodies Elections Issue : గడువు తీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఎన్నికలకు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పీసీసీ అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ సభలో వెల్లడించారు. దీంతో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడువస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్న ఆశావహుల ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లైంది. గత ఎనిమిది మాసాలుగా ప్రజలతో మమేకమై స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వీరి కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది.

రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి : కులగణన ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాపై గణాంకాలు తీసి రిజర్వేషన్ల నిర్ధారణ అనేది సుదీర్ఘ కసరత్తుతో పాటు చాలా రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ 2025లోనే జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ కులగణనపై ముఖ్యమంత్రి ప్రకటన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ నేపథ్యంలో గత సర్కారు అమల్లోకి తెచ్చిన ‘పంచాయతీ రాజ్‌ చట్టం-2018 అమలుపై సందిగ్ధం ఏర్పడింది.

ఒక వేళ పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేర్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్‌ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశమున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ఇదే జరిగితే పాత రిజర్వేషన్ల ప్రాతిపదికన గత 8 నెలలుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఆలోచనలు తారుమారయ్యే అవకాశం ఉండటంతో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా : గత ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ సమయంలో ఈసీ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు జూన్‌లో నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ బీసీ రిజర్వేషన్ల విషయం ఎటూ తేలకపోవడం, కులగణన డిమాండ్‌ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యాయి.

ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ అడుగు ముందుకేసి సెప్టెంబరు 28 వరకు తుది ఓటరు జాబితా ప్రచురణ, ఇతరత్రా పనులు ముగించాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతోందనే సంకేతాలు రావడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇటీవలి సీఎం ప్రకటనతో వచ్చే కొత్త ఏడాదిలోనే స్థానిక పోరు ఉంటుందనే చర్చ జోరందుకుంది.

పంచాయతీ ఎన్నికలకు ముందే ఆ సర్పంచ్​ గెలిచేశారు - అదీ ఏకగ్రీవంగా! - Sarpanch Unanimous Election

పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్దం చేయండి - అధికారులకు ఎస్ఈ​సీ ఆదేశం - SEC Meeting on Panchayat Elections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.