Liquor Shops Applications Deadline Over in AP: రాష్ట్రంలో ఈ రోజు రాత్రి 7 గంటలతో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. ఇప్పటి వరకూ మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 85 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకూ దాదాపు 1800 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3379 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ స్వీకరించింది. ఈ నెల 14వ తేదీన లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయించనుంది. అక్టోబరు 15 తేదీ నాటికి దుకాణాలను లాటరీలో దక్కించుకున్న ప్రైవేటు వారికి అబ్కారీ శాఖ అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.
అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో నోటిఫై చేసిన 113 దుకాణాలకు 5700 కుపైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల నుంచి సమాచారాన్ని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు క్రోడీకరిస్తున్నారు. ఇంకా గడువు ముగిసే సమాయానికి 90 వేల దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం దుకాణాల కోసం రిజిస్ట్రేషన్లు ముగిసినా రాత్రి 12 గంటల్లోగా డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆన్లైన్లో మద్యం దుకాణాలకు దరఖాస్తు దాఖలయ్యాయి. తమ అనుచరులు వేసే మద్యం టెండర్లకు కొంద మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఫీజులు చెల్లిస్తున్నారు.
మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు మద్యం సిండికేట్లు భారీ ఎత్తున ఏర్పడ్డాయి. దరఖాస్తులు పెద్దగా పడకుండా మద్యం సిండికేట్లు రింగ్ అయ్యాయి. ఇటీవల సీఎం చంద్రబాబు హెచ్చరికతో మద్యం టెండర్ల ఎపిసోడ్ ఒక దారిలోకి వచ్చాయి. ఈ స్థాయిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అన్ని రకాల బ్రాండ్లకు చెందిన చీప్ లిక్కర్ ను రూ. 99కే ఎక్సైజ్ శాఖ అందివ్వనుంది.
లిక్కర్ లక్కు ఎవరికో! - మద్యం షాపుతో జాతకం మారేనా? - రాయబారాలు ఫలించేనా!
మద్యం దుకాణాల్లో మాకు షేర్ ఇవ్వండి - లేదా వాటిని వదిలేయండి - AP Wine Shop Tenders 2024