ETV Bharat / state

లాటరీ లక్ ఎవరికో? మద్యం కిక్ ఎవరికో? - వైన్స్ దరఖాస్తుదారుల్లో టెన్షన్​ టెన్షన్

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న లిక్కర్‌ షాప్‌ లైసెన్సుల ప్రక్రియ - కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీస్తున్న కలెక్టర్లు

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Liquor Shop Allotment Process Going on in Andhra Pradesh
Liquor Shop Allotment Process Going on in Andhra Pradesh (ETV Bharat)

Liquor Shop Allotment Process Going on in Andhra Pradesh : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం లాటరీ తీస్తున్నారు. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన దుకాణాల సీరియల్ నంబర్‌ ప్రకారం లాటరీ తీస్తున్నారు. ఈ ప్రక్రియంతా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరుగుతోంది. రాష్ట్రంలో అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 దరఖాస్తులు రాగా, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 దుకాణాల్ని నోటిఫై చేశారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల మేర ఆదాయం సమకూరింది. తిరుపతి, శ్రీసత్యసాయి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఆయా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకోవటం, కొన్నిచోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. తాడిపత్రి, కమలాపురం వంటి నియోజకవర్గాల్లో ఒక్కో దుకాణానికి రెండు, మూడేసి దరఖాస్తులే వచ్చాయి.

సగటు దరఖాస్తులు : రాష్ట్రంలో సగటున ఒక్కో మద్యం దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 51-52 దరఖాస్తులు దాఖలయ్యాయి. సగటున ఒక్కో దుకాణానికి ఏలూరు జిల్లాలో 38, తూర్పుగోదావరి దరఖాస్తులు, గుంటూరు జిల్లాల్లో 35 దరఖాస్తులు, విజయనగరం జిల్లాలో 34 దరఖాస్తులు, పశ్చిమ గోదావరిలో 32, కర్నూలు, డా.బీఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 30 దరఖాస్తులు వచ్చాయి.

పకడ్బంధీగా కేటాయింపు ప్రక్తియ : కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎక్సైజ్ అధికారులు లాటరీ తీసి మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ 16 షాపులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో మొత్తం 123 మద్యం దుకాణాలకు 2942 దరఖాస్తులు వచ్చాయి. ఒంగోలులోని అంబేడ్కర్‌ భవనంలో రెండు కౌంటర్ల ద్వారా మద్యం దుకాణాలు కేటాయిస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కలిసి లాటరీ తీస్తున్నారు. జిల్లాలోని 171 మద్యం దుకాణాల కోసం మొత్తం 3466 దరఖాస్తులు వచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని 52 దుకాణాలకు నాయుడు ఫంక్షన్ హాల్లో లాటరీ తీస్తున్నారు. విజయవాడలోని గురునానక్‌ కాలనీలో మద్యం దుకాణాల కేటాయింపు సాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.