Liquor Sales Increased in Telangana : రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలతో పాటు వెయ్యికిపైగా బార్లు, క్లబ్‌లు, పబ్‌లు ఉన్నాయి. దసరా పండగ సందర్భంగా భారీగా మద్యం అమ్ముడుపోతుందని అంచనా వేస్తున్న దుకాణాదారులు పెద్ద మొత్తంలో నిల్వలు సిద్దం చేసుకున్నారు. శుక్రవారం ఒక్కరోజు రూ.200 కోట్లు స్టాక్ ఎక్సైజ్ డిపోల నుంచి దుకాణాలకు, బార్లకు, క్లబ్‌లకు, పబ్‌లకు చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రెండు రోజుల్లో భారీ అమ్మకాలు : సాధారణంగా ఒక్కో దుకాణంలో సగటున రూ.30 నుంచి రూ.40 లక్షలు విలువైన మద్యం నిల్వలు ఉంటాయి. సాధారణ రోజుల్లో ఒక్కో దుకాణంలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల విలువ చేసే మద్యం అమ్ముడుపోతుందని దుకాణదారులు చెబుతున్నారు. కాని శని, ఆదివారాల్లో రెట్టింపు మద్యం అమ్ముడుపోయే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా సగటున మరో పది లక్షలు విలువైన మద్యాన్ని అదనంగా దుకాణదారులు నిల్వ చేసుకున్నట్లు తెలంగాణ వైన్స్ అసోసియేషన్ చెబుతోంది.
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నెల పదో తేదీ వరకు రూ.28,881.65 కోట్ల విలువైన 2.88కోట్ల కేసుల లిక్కర్, రూ.4.26కోట్ల కేసుల బీర్ అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో రూ.27,529.49 కోట్ల విలువైన 2.71కోట్ల కేసుల లిక్కర్, 4.26 కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
దసరా వేళ మందుబాబులకు బిగ్ షాక్ - రెండు రోజుల పాటు వైన్స్ బంద్
ఈ నెల ఒకటో తేదీ నుంచి శుక్రవారం వరకు 11 రోజుల్లో రూ.1057.42 కోట్ల విలువైన 10.44లక్షల కేసుల లిక్కర్, 17.59 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయింది. ఇందులో ఈ నెల పదో తేదీ వరకు రూ.852.4 కోట్ల విలువైన 8.36లక్షల కేసుల లిక్కర్, 14.53లక్షల కేసుల బీరు అమ్ముడు పోయింది. అయితే ఒక్క శుక్రవారం రోజునే ఎక్సైజ్ డిపోల నుంచి దుకాణాలకు రూ.205.42 కోట్ల విలువైన 2.08లక్షల కేసుల లిక్కర్, 3.07లక్షల కేసుల బీరు అబ్కారీ శాఖ మద్యం డిపోల నుంచి మద్యాన్ని దుకాణదారులు తెచ్చుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
హైదరాబాద్‌లో అమ్మకాలు తగ్గే అవకాశం : రాష్ట్రంలోని 2620 మద్యం దుకాణాల్లో, వెయ్యికిపైగా బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్‌లు అన్నింటిలో కలిసి దాదాపు రూ.1500 కోట్ల విలువైన మద్యం అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా అయితే అమ్ముడుపోతున్న మద్యంలో 70శాతం హైదరాబాద్, పరిసర జిల్లాల్లోనే ఉండగా మిగిలిన 30శాతం మాత్రమే జిల్లాల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే దసరా పండుగకు హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు సొంతూర్లకు వెళ్లారు. దీంతో జిల్లాల్లో మద్యం విక్రయాలు పెరుగుతాయన హైదరాబాద్, పరిసర జిల్లాల్లో కొంత తగ్గే అవకాశం ఉందని దుకాణదారులు అంచనా వేస్తున్నారు.
'మద్యం ప్రియులకు శుభవార్త - బీర్ల కొరతేమీ లేదు - పుష్కలంగా తాగండి' - No Liquor Shortage in AP
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ - మళ్లీ రెండు రోజులు వైన్స్ బంద్! - Wines To Be Closed For Two Days