YS Jagan Failed to Liquor Ban in AP: ప్రతిపక్షంలో మద్యంపై మొసలి కన్నీరు కార్చిన జగన్ ఐదేళ్లలో చేసిందేంటి? లక్షా 54 వేల కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయించడాన్ని నిషేధం అంటారా? పేదల రక్తాన్ని స్ట్రా వేసుకుని మరీ తాగడం అంటారా? రాష్ట్రంలో అనేక మంది చెల్లెమ్మల తాళిబొట్టు తెంచిందెవరు? మద్యపానాన్ని నిషేధిస్తానని మాటిచ్చి, మడమ తిప్పింది జగన్ కాదా? మద్యం ఆదాయాన్నే ప్రధాన వనరుగా మార్చుకున్నది జగన్ కాదా? చెప్పు జగనన్నా అని అక్కచెల్లెమ్మలు నిలదీస్తున్నారు.
మద్యం ఆదాయాన్ని మహదానందంగా ముద్దుచేసిన జగన్ జే బ్రాండ్లతో లక్షల మంది జీవితాల్ని బలిపీఠంపైకి నెట్టారు! తరచూ మద్యం తాగే అలవాటున్నా కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ఏపీలో పిచ్చి మందు కారణంగా ఓ మాదిరిగా తాగే అలవాటున్న వారికి కూడా రెండు, మూడేళ్లలోనే కాలేయం, క్లోమగ్రంథి దెబ్బతింటున్నాయి. చాలామందికి కడుపులో, నోట్లో పుండ్లు పడుతున్నాయి. నాడీ వ్యవస్థ దెబ్బతిని రక్త ప్రసరణలో ఇబ్బందులు వస్తున్నాయి. మానసిక సమస్యలు చుట్టుముడుతున్నాయని బాధిత కుటుంబాలు కంటతడిపెడుతున్నాయి.
ఏపీలో ఏరులై పారుతున్న మద్యం - మద్యపాన నిషేధం హామీ ఏమైంది జగన్? : మహిళా సమాఖ్య ప్రతినిధి
మద్యం తాగుతున్నవారిలో ఎక్కువ మంది రోజు కూలీలు, శారీరక శ్రమ చేస్తూ బతికేవారే. జే బ్రాండ్లు తాగాక వారిలో నిస్సత్తువ,నీరసం ఆవహిస్తోంది. గతంలో మాదిరి శారీరకంగా శ్రమించలేకపోతున్నారు. నెలలో సగం రోజులకుపైగా పనికి వెళ్లలేకపోతున్నారు. రోజువారీ ఆదాయం కోల్పోయి కుటుంబాలకు పూటగడవడమే కష్టంగా మారుతోంది!
ఆందోళనకరంగా పరిస్థితి: మద్యం దుకాణాల వద్ద ఫిబ్రవరిలో ఈటీవీ భారత్ - ఈటీవీ -ఈనాడు ప్రతినిధులు చేసిన సర్వేలో జే బ్రాండ్లు తాగి అనారోగ్యం బారినపడుతున్నట్లు 80శాతం మంది వాపోయారు. గతేడాది సెప్టెంబరులో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఉదరకోశ వ్యాధుల విభాగాలకు వస్తున్న రోగుల వివరాలు చూస్తే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతుంది.
95 శాతం మంది కాలేయం దెబ్బతిన్న వారే: విజయవాడ జీజీహెచ్ ఉదరకోశ వ్యాధులవిభాగంలో 40శాతం మంది మద్యం బాధితులే. విశాఖ కేజీహెచ్ ఉదరకోశ వ్యాధుల విభాగంలో 2021 జులై నుంచి 2022 జూన్ మధ్య 1060 మంది చేరగా వారిలో 471 మంది మద్యం పీడితులే. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో గత మూడేళ్లలో 5 వేల 93 మంది మద్యం బాధితులు చికిత్స పొందారు. తిరుపతి స్విమ్స్‌లోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో శస్త్రచికిత్సలు అవసరంపడుతున్న రోగుల్లో 95% మంది మద్యపానంతో కాలేయం దెబ్బతిన్న వారే.
మద్యంతో జగన్‌కు ఆదాయం కిక్కు - పేదల ప్రాణాలకు ముప్పు: ఎన్డీఏ నేతలు - NDA Leaders on Liquor Ban IN AP
సంక్షేమ పథకాల కింద 2లక్షల 70 వేల కోట్లు బటన్ నొక్కానని జగన్ ప్రతీ సభలో డప్పేసుకుంటున్నారు.! కానీ, మద్యం ప్రియుల నుంచి జగన్ గుంజుకున్నది దాదాపు 3 లక్షల 14 వేల కోట్లపైమాటే! మద్యం బాధితుల్లో అత్యధికులు బడుగు, బలహీనవర్గాల వారే. జే బ్రాండ్లు తాగి, ఐదేళ్లలో దాదాపు 10 లక్షలమంది అనారోగ్యాలపాలయ్యారు. చికిత్సల కోసం ఒక్కో బాధిత కుటుంబం సగటున 4 లక్షల వరకూ వెచ్చించింది. ఈ లెక్కన 10 లక్షల మంది కోల్పోయింది దాదాపు 40 వేల కోట్ల రూపాయలు కోల్పోయారు.
ఇక, జే బ్రాండ్ల మద్యం తాగి రోజువారీ కూలీలు పనులకు వెళ్లలేక ఒక్కొక్కరు నెలకు 20 వేల రూపాయల మేర ఆదాయం కోల్పోతున్నారు. అలాంటి వారు దాదాపు 12 లక్షల మంది ఉంటారు. ఈ లెక్కన ఏడాదికి 24 వేల కోట్లు నష్టపోయారు. ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్లు కోల్పోయారు! మద్యం విక్రయాల ద్వారా జగన్ పోగేసుకున్న లక్షా 54 వేల కోట్లు కూడా కలిపితే ప్రజలకు జరిగిన నష్టం 3లక్షల 14 వేల కోట్లు.
కాకాణి నకిలీ మద్యంతో ప్రజలను చంపేందుకు చూస్తున్నారు : టీటీపీ నేత సోమిరెడ్డి - Somireddy Comment
హానికారక రసాయనాలు: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న వివిధ బ్రాండ్ల మద్యాన్ని తెలుగుదేశం నేతలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెన్నైలోని ఎస్‌జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రయోగశాలలో వేర్వేరుగా పరీక్షలు చేయించారు. వాటిల్లో పైరోగలాల్, డై ఇథైల్ థాలేట్, ఐసోపులెరిక్ యాసిడ్ వంటి హానికారక రసాయనాలు ఉన్నట్లు తేలింది. మద్యం ఉపద్రవం రాష్ట్రాన్ని ఈ స్థాయిలో కమ్మేస్తే, జగన్ మాత్రం ప్రభుత్వానికి ఆదాయాన్ని తగ్గించేందుకు విషపూరిత కుట్రకు తెరలేపారంటూ ఎదురుదాడి చేశారు.