ETV Bharat / state

అనతికాలంలోనే క్రీడలపై పట్టు - జాతీయస్థాయిలో రాణిస్తున్న అనకాపల్లి కుర్రోడు - Laxman of Anakapalle Para Athlete - LAXMAN OF ANAKAPALLE PARA ATHLETE

Laxman of Anakapalle Showing Skills in Para Athletics Getting Medals at Various Levels : పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు. అప్పటి నుంచి ఒంటరితనానికి దగ్గరయ్యాడు. వయసు పెరుగుతుంటే నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. కానీ, అందులోంచి బయటపడేందుకు ఆటలనే ఆయుధంగా ఎంచుకున్నాడు. ఆత్మవిశ్వాసం పెంచుకుంటూనే అనతికాలంలోనే క్రీడలపై పట్టు సాధించాడు. తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో 2 పతకాలు సాధించి వారెవ్వా అనిపించిన అనకాపల్లి కుర్రాడి సక్సెస్ స్టోరీ ఇది.

laxman_of_anakapalle
laxman_of_anakapalle (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 1:28 PM IST

Laxman of Anakapalle Showing Skills in Para Athletics : ఆర్థిక ఇబ్బందులున్నా ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా ముందుకు సాగుతున్నాడీ యువకుడు. తనలోని లోపం చూసి బాధపడకుండా ఆటల్లో రాణించాలనే తపనతో అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నాడు. పట్టుదలతో శ్రమించి మొదటి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో పతకాలు సాధించాడు. ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించాడు ఈ యువ క్రీడాకారుడు.

మైదానంలో పరుగులు పెడుతున్న ఈ యువకుడి పేరు బండారు లక్ష్మణ్‌. అనకాపల్లి జిల్లా జోగన్నపాలెంలో జన్మించాడు. తల్లిదండ్రులు అర్జున్‌, సత్యవతి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్న లక్ష్మణ్‌ పుట్టుకుతోనే పోలియో బారిన పడ్డాడు. ఎడమ చేయి సరిగ్గా పనిచేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

అంగవైకల్యంతో నిరాశకు లోనైన లక్ష్మణ్‌ ఎలాగైనా దానిని అధిగమించాలని తలచాడు. అందుకోసం క్రీడలే సరైన మార్గమని భావించాడు. సోదరుడి సలహా మేరకు చిన్న వయసులోనే సొంతూరిని వదిలి విజయనగరానికి వచ్చాడు. అలా ఏడో తరగతిలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగ్గట్టుగా అహర్నిశలు శ్రమిస్తున్నాడు. విజయనగరానికి వచ్చిన కొత్తలోనే ఓ ప్రైవేటు క్రీడా అకాడమీలో చేరాడు లక్ష్మణ్‌. ఒక వైపు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే అథ్లెటిక్స్‌లో పట్టుసాధించాడు. నిత్యం మైదానానికి వెళ్తూ కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో స్వర్ణపతకం సాధించి పలువురి ప్రశంసలూ అందుకున్నాడు.

ఆశే ఆశయం - అవమానాలెదురైనా ఆగని పరుగు - ఒలింపిక్సే లక్ష్యమంటున్న యువకుడు - Abdulla Excels in Athletics

'నాలుగేళ్లుగా పరుగుపందెం పోటీల్లో ప్రతిభ చూపుతూ జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యాను. బెంగళూరులో ఇటీవల జరిగిన సీనియర్‌ పారా నేషనల్‌ మీట్‌లో పాల్గొని గెలిసాను. 400 మీటర్ల పరుగులో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజత పతకాలు సాధించాను. పాల్గొన్న మొదటి జాతీయ టోర్నీలో 2పతకాలు సొంతం చేసుకున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. ఇవే నాకు ప్రోత్సాహకాలు.' - బండారు లక్ష్మణ్, పారా అథ్లెట్

తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న తపనతోనే క్రీడా రంగాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నాడీ పారా అథ్లెట్‌. తొలి జాతీయ టోర్నమెంట్‌లోనే పతకాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు గెలుచుకోవడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు.

'అర్థిక సమస్యలు వెంటాడుతున్నా వెన్నుచూపక జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. పారా అథ్లెట్లలోని ప్రతిభ వెలికితీస్తే పతకాలు సాధిస్తారు. 2028 జరిగే పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే విధంగా లక్ష్మణ్‌ సాధన చేస్తున్నాడు.' - కృష్ణారెడ్డి, లక్ష్మణ్‌ కోచ్‌

పదహారేళ్ల వయసులోనే పతకాల పంట పండిస్తున్నాడీ పారా అథ్లెట్‌. దాతల సహకారం అందిస్తే అంతర్జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని దేశానికి పతకాలు సాధిస్తానని చెబుతున్నాడు

విజయవాడ విలుకాడు- శిక్షణ ప్రారంభించిన అనతి కాలంలోనే పతకాల పంట - Archery champion Trinath

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.