Laptop Selling Increased tremendously in India : కొవిడ్-19 తర్వాత కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వినియోగం భారీగా పెరిగింది. కరోనా సమయంలో దాదాపు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. కానీ కంప్యూటర్ల వినియోగం మాత్రం భారీగా పెరిగింది. ఎంతలా అంటే కేవలం మూడేళ్లలో విక్రయాలు రెట్టింపయ్యాయి. కరోనాకు ముందు దేశవ్యాప్తంగా ల్యాప్‌టాప్‌ల వినియోగం ఏటా 3 మిలియన్లు ఉంటే, ప్రస్తుతం అది దాదాపు 7 మిలియన్లకు చేరుకుంది. గతంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం అంటే కేవలం కంప్యూటర్(Computer) కోర్సులు చేసేవాళ్లు, ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు మాత్రమే వినియోగించేవారు.
సాఫ్ట్‌వేర్ రంగం పుంజుకున్న తర్వాత ఈ రంగం మరింత అభివృద్ది చెందింది. కంప్యూటర్లతో పోల్చితే ల్యాప్‌టాప్‌లు ఎక్కడికైనా తీసుకెళ్లే సౌకర్యం ఉండటం, అంతే కాకుండా విద్యుత్ సరఫరా లేకుండా కొన్ని గంటల పాటు పని చేసే అవకాశం ఉండటంతో ధర ఎక్కువైనా ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు. ప్రముఖ కంపెనీలు సైతం ల్యాప్‌టాప్‌ల విక్రయాలపైనే దృష్టి పెడుతున్నాయి. కొన్ని కోర్సుల తరగతులు, కార్యాలయాల సమావేశాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తుండటంతో ల్యాప్‌టాప్‌ల వినియోగం అమాంతం పెరిగిపోయింది.
Huge Demand for Laptops in India : డెస్క్ టాప్‌కు అయితే మళ్లీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం, యూపీఎస్(UPS) అమర్చుకోవడం వంటి అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాప్‌టాప్ అయితే ఈ సమస్యలేమీ ఉండవు. దీంతో ల్యాప్‌టాప్‌ల విక్రయం ఎక్కువగా ఉంది. 2022-23లో కాస్త విక్రయాలు తగ్గినా పరిస్థితి తిరిగి యథాతథ స్థితికి చేరుకుంది. హెచ్‌పీ(HP), డెల్, ఆపిల్, ఏసూస్(Asus), లెనోవో, ఏసర్ కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా విక్రయమవుతున్నాయి. ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరగడంతో వాటిని మరమ్మతు చేసే టెక్నీషియన్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోందని నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తాయి. వాటిని ఏడాది లేదా రెండేళ్ల పాటు వినియోగించిన తర్వాత తక్కువ ధరకు విక్రయిస్తాయి. వీటిని గంపగుత్తగా కొనుగోలు చేసి వ్యాపారులు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. మౌస్‌లు(Mouse), సీడీలు, హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు(Pendrive) ఇలా ఇతర అనుబంధ వస్తువులకు సంబంధించిన వ్యాపారం సైతం బాగా ఉంది. రాబోయే రెండేళ్లలో కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల విక్రయాలు కోటికి చేరుకుంటాయని సంబంధిత కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఆ మేరకు ప్రముఖ కంపెనీలు తమ స్టోర్‌లను విస్తరించే ప్రణాళికలో ఉన్నాయి.
'మా దగ్గర గేమింగ్ మూడ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. వాటిని కస్టమర్ పట్టుకొని అద్భుతంగా ఫీల్ అవుతారు. అన్నీ రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉన్నాయి. విద్యార్థులకు సరైన ధరల్లో ల్యాప్‌టాప్‌లు అమ్ముతాం' -జిగ్నేష్, ఏసూస్ ప్రతినిధి
రూ.3000 బడ్జెట్లో మంచి స్మార్ట్‌వాచ్ కొనాలా? టాప్-9 ఆప్షన్స్ ఇవే!
తడిచిన ఫోన్‌ను బియ్యంలో పెడుతున్నారా? మరింత డ్యామేజ్ పక్కా! ఇలా చేస్తే బెటర్