ETV Bharat / state

మన్యంవాసులను హడలెత్తిస్తున్న మందుపాతరలు - ఆధిపత్య పోరులో బలవుతున్న అమాయకులు - Landmine Tension in Manyam Areas - LANDMINE TENSION IN MANYAM AREAS

Landmine Tension in Manyam Areas : మన్యం ప్రాంతాల్లో వరుస మందుపాతరలు ఆదివాసీలను హడలెత్తిస్తున్నాయి. పోలీసులు, మావోయిస్టులకు జరిగే ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు. ములుగు జిల్లాలోని తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో 10 రోజుల క్రితం అడవిలోకి కట్టెలు కొట్టేందుకు వెళ్లి ఓ గ్రామస్థుడు మరణించగా, తాజాగా మందుపాతర పేలిన ఘటనలో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Landmine Tension in Manyam Areas
Landmine Tension in Manyam Areas (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 7:05 PM IST

Updated : Jun 14, 2024, 8:03 PM IST

మన్యంవాసులను హడలెత్తిస్తున్న మందుపాతరలు - ఆధిపత్య పోరులో బలవుతున్న అమాయకులు (ETV Bharat)

Landmine Tension in Manyam Areas in Mulugu District : దండకారణ్యంలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసే మందుపాతరలు సాధారణ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. అడవి ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ప్రకృతిపై ఆధారపడి జీవించే గిరిపుత్రులు, నిత్యం అడవిలోకి వెళ్లకుండా ఉండలేని పరిస్ధితి. వెళ్తే ఏం జరుగుతుందో ‌అని తెలియక భయాందోళనలకు గురవుతున్నారు. కాలినడకన బతుకు బండినీడ్చేవారు, ఎక్కడ మందుపాతర పేలుతుందో తెలియక హడలెత్తిపోతున్నారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని దండకారణ్యంలో మావోలు అమర్చిన మందుపాతర పేలి ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. వీఆర్కే పురానికి చెందిన 150 మంది తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని బెడం మల్లన్న స్వామి ఆలయానికి కాలినడకన బయలుదేరారు. మార్గమధ్యలో కర్రిగుట్టల వద్ద మందు పాతర పేలడంతో సునీత అనే మహిళ తీవ్ర గాయాలపాలైంది. ఈ ప్రమాదంలో మహిళ కాలు పూర్తిగా ఛిద్రమైంది. వెంటనే బాధితురాలిని డోలీలో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలెంవాగు మధ్యతరహా జలాశయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పేల్చేసిన పోలీసులు - ఇదిగో వీడియో చూసేయండి

కట్టెల కోసం వెళ్లి - మందుపాతరపై కాలువేసి : దండకారణ్యంలో ఇటీవల ఇదే తరహా ఘటన జరిగింది. వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో అమర్చిన మందు పాతర పేలడంతో జగన్నాథపురానికి చెందిన ఏసు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఏసు మరో నలుగురు గ్రామస్థులతో కలిసి కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళ్లి, ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలేసి మృతి చెందాడు. వాజేడు మండలం అరుణాచలపురం అటవీ ప్రాంతంలో గత నెల 30న ప్రెజర్ బాంబు పేలిన ఘటనలో ఓ శునకం మృతి చెందగా, మరొకటి గాయపడింది. ప్రత్యేక బలగాలు అడవుల్లో మందు పాతరల ఉనికిని పసిగట్టి నిర్వీర్యం చేస్తున్నా, గూడెంవాసులు జీవనోపాధి కోసం అడవికి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఎన్నికల సమయంలో సరిహద్దు ప్రాంతంలో బలగాలు ప్రత్యేక కూంబింగ్ నిర్వహించగా, వారిని లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు ఈ మందు పాతరలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రతా బలగాలను అటవీ ప్రాంతంవైపు రానీయకుండా చేసేందుకు ఈ మందుపాతరల్ని మావోలు అమర్చినట్లు తెలుస్తోంది. మందుపాతరలతో అమాయక గిరిజనలు బలవుతున్నారని, ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడే మావోయిస్టులు, వారికి సహకరించే వారినీ ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అడవిని నమ్ముకుని జీవించే తాము అడవుల్లోకి వెళ్లకుండా ఎలా బతకగలమని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'పక్కా ప్లాన్​తో పోలీసులపై నక్సల్స్ దాడి.. 2 నెలల ముందే రోడ్డు కింద మందుపాతర'

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి జర్నలిస్టు మృతి

Last Updated : Jun 14, 2024, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.