ETV Bharat / state

తెలంగాణలో భూముల మార్కెట్‌ విలువ పెంపు! - ఎంత శాతం అంటే? - Land Market Value in Telangana - LAND MARKET VALUE IN TELANGANA

Land Market Value Hike in Telangana : రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువను పెంచడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే భూముల ధరల పెంపుపై స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టారు. భూముల మార్కెట్ విలువలో సవరణలు చేస్తే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు భారీగా పెరగనున్నాయి.

Land Market Value hike
Land Market Value hike (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 7:12 AM IST

Telangana Lands Market Value Hike : తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువ పెరగనున్నాయి. సుమారు 20 నుంచి 40 శాతం మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములు, వెంచర్లు, స్థలాలు, అపార్ట్‌మెంట్లకు సంబంధించి, ఆయా ప్రాంతాల వారీగా ఈ నెల 18వ తేదీ నుంచి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టారు. భూముల విలువల సవరణపై ప్రాథమిక అంచనాలను శాఖ ప్రధాన కార్యాలయంలో అందజేశారు.

2021 నాటి సవరణ తరువాత అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్, బహిరంగ మార్కెట్‌ విలువలను పరిగణనలోకి తీసుకున్నారు. తద్వారా రూపొందించిన సవరణ ప్రతిపాదనలు మొదటి దశలో సబ్‌ రిజిస్ట్రార్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు, వారి పరిశీలన అనంతరం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ DIG కార్యాలయాలకు వచ్చాయి. ప్రతిపాదనలను తుది పరిశీలనలు పూర్తిచేసిన డీఐజీలు మంగళవారం కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు ఆ వివరాలు సమర్పించాల్సి ఉండగా వాయిదా పడింది.

ప్రభుత్వం తాజాగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌కు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా (అదనపు బాధ్యతలు) అప్పగించింది. ఈ పోస్టులో ఉన్న నవీన్‌మిత్తల్‌ నుంచి జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ కాకపోవడం వల్ల భూముల మార్కెట్‌ విలువల సవరణకు సంబంధించి మంగళవారం కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ నిర్వహించాల్సిన సమీక్ష వాయిదా పడింది. బుధ లేదా గురువారాల్లో ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.

Prathidwani : కోట్లపేటను తలపించిన కోకాపేట భూముల వేలం.. ఎందాకా ఈ జోరు?

రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువ పెంపు అధికంగా ఉంటుందని సమాచారం. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో ఐదారేళ్లుగా, బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు భారీగా పెరిగాయి. నగరాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోకి భూముల ధరలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ విలువకు, బహిరంగ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పెంపు కనీసం 40 శాతం ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంటే చదరపు గజం విలువ ఇప్పుడు అమల్లో ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారం లక్ష రూపాయలు ఉంటే, కొత్త విలువ ప్రకారం ఒక లక్షా నలభై వేలకు చేరుతుంది. మండలాలు, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల విలువల పెంపు 20 శాతం వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల విలువలు భారీగా సవరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎకరా కనీస ధర రూ.75 వేలుగా ఉండగా, మారుమూల గిరిజన ప్రాంతాలను మినహాయించనున్నారు. ఇక ఇతర ప్రాంతాల్లో ఎకరా కనీస విలువ రూ.2.50 లక్షలుగా నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రం, స్థానిక ధరల ఆధారంగా పెంపు జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

భూముల ధరల పెంపుపై సర్కార్ కసరత్తు - దాదాపు రూ.4 వేల కోట్ల అదనపు రాబడి వస్తుందని అంచనా - TG Govt To Increase Land Price 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.