KVP Ramachandra Rao on CM Jagan: ప్రధాని దర్శనం దొరికినందుకు జగన్‌కు అభినందనలు అని వైఎస్ సన్నిహితులు, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ సార్లు దిల్లీకి వెళ్లిన సీఎం జగనే అని ఆయన అన్నారు. ఇసుక, మద్యం కుంభకోణంలో దేశంలో చాలా మంది నేతలు అరెస్టు అయ్యారని, ఈ కేసుల్లో అరెస్టు నుంచి ఏపీ నేతలకు మాత్రం మినహాయింపు ఇచ్చారని కేవీపీ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియడం లేదని కేవీపీ అన్నారు. అధికార పార్టీ పొలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
KVP Ramachandra Rao: 'రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే వైఎస్ ఆత్మ శాంతిస్తుంది'
భారతీయ జనతా పార్టీ దృష్టిలో మరకలేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే ఉందని అనుకుంటునట్లుగా ఉందని కేవీపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలోని మంత్రులు, ఎంపీలపై కేసులు ఎందుకు లేవో బీజేపీ చెప్పాలని ప్రశ్నించారు. దేశమంతా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయని, అలాంటిది ఏపీలో నగదుతో విక్రయాలు జరిగినా కేంద్రం పట్టించుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ బొమ్మతో ఓట్లడగడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియడం లేదన్నారు. పోలవరం విషయంలో భావితరాలు జగన్ ప్రభుత్వాన్ని క్షమించవని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటోందని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్రంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి తనతో చెప్పారని వివరించారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ కీలక వ్యాఖ్యలు.. జగన్‌కు దూరంపై వివరణ..!
దిల్లీ వెళ్లిన జగన్ కేంద్రం నుంచి ఏం సాధించారో తెలియదని, పాత అంశాలనే ప్రధానికి వివరించి మళ్లీ రాష్ట్ర ప్రజలను మభ్యపెడతారని కేవీపీ ఆరోపించారు. చెల్లి, తల్లిపై అసభ్య పోస్టులు పెడితే చర్యలు తీసుకోని అసమర్థ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వమని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, బీజేపీ పార్టీలు ఏపీ ప్రజలను మోసగించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత మట్టి, జలాలిచ్చి ఏపీ నోట్లో మోదీ మట్టికొట్టారని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు బీజేపీ రాష్ట్రానికి ఏం మేలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన హామీలపై జగన్ మాట్లాడకపోవడం దారుణం : వైఎస్ సన్నిహితుడు కేవీపీ