ETV Bharat / state

కిన్నెర మొగులయ్యతో కేటీఆర్ భేటీ - అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ - KTR meet Kinnera Mogulaiah

KTR meet Kinnera Mogulaiah : తెలంగాణ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యను మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ప్రభుత్వం పెన్షన్ నిలిపివేయడంతో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మొగులయ్యకు, కేటీఆర్ ఆర్ధిక సహాయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మొగుల్యయకు కళాకారుల పెన్షన్​ పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

KTR Tweet on Petrol Prices
BRS KTR meet Kinnera Mogulaiah (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 3:53 PM IST

BRS KTR meet Kinnera Mogulaiah : ప్రముఖ తెలంగాణ జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్యను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కలిశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన కళాకారుల పెన్షన్ నిలిపివేయడంతో ఆయన కూలీ పని చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తల పట్ల స్పందించిన కేటీఆర్, మొగులయ్యతో ఆర్థిక ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ మేరకు కేటీఆర్, మొగులయ్యకు కొంత ఆర్థిక సహాయం చేశారు.

‘బేటీ బచావో’ నమునా ఇదేనా - బీజేపీపై కేటీఆర్ ట్వీట్ వార్! - KTR Tweet on PM Modi

మొగులయ్యకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్​తో పాటు, అన్ని రకాల హామీలను నెరవేర్చాలని కేటీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొగులయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకి గర్వకారణమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన గుర్తు చేశారు. రోజువారి జీవితం గడపడడమే కష్టంగా ఉన్న ప్రస్తుత సందర్భంలో కేటీఆర్ చేసిన సహాయం పట్ల మొగులయ్య సంతోషం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే.. మొగులయ్య హైదరాబాద్ పట్టణ సమీపంలోని తుర్కయమంజాల్​లో ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్​గా మారింది. ఆయన పొట్టకూటికోసం కూలి పనులకు వెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు గత ప్రభుత్వం ఇస్తున్న నెలవారి గౌరవ వేతనం ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈవార్తపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. మొగులయ్య కుటుంబ బాగోగులు వ్యక్తిగతంగా తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. వెంటనే తన టీం సభ్యులు అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. కాగా ఈవార్తను తన దృష్టికి తెచ్చిన సుచేతా దలాల్​కు ధన్యవాదాలు తెలిపారు.

KTR Tweet on Petrol Prices : మరోవైపు ఎక్స్​లో బీజేపీ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. పెట్రోల్ ధరలతో ఇప్పటికే సామాన్యుడి నడ్డి విరుస్తున్న కాషాయపార్టీ, అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని నమ్మి ఓటేస్తే ఇగ ఆగమే అని ఆరోపించారు. బీజేపీ అంటున్న చార్ సౌ అనేది సీట్ల గురించి కాదని, పెట్రోల్ రేట్ల గురించని ఎద్దేవా చేశారు. 2014లో లీటర్ పెట్రోల్ 70 రూపాయలు ఉండగా, 2024లో 110కు చేరిందన్నారు. ఈ సారీ బీజేపీ అధికారంలోకి వస్తే 2029 నాటికి లీటర్ పెట్రోల్ 400 అవుతుందన్నారు. పెట్రోల్ పెరుగుదలపై బీఆర్ఎస్ రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్​లో కేటీఆర్ పోస్టు చేశారు.

సిరిసిల్లలో కేటీఆర్‌, అవ్వ మధ్య ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్ - KTR conversation in Siricilla

కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు : కేటీఆర్ - KTR Election campaign in Sircilla

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.