KTR on Water Scarcity in State : రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్యపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth) నీటి సమస్యలను తీర్చే చావ లేక, చేతకాక లోటు వర్షపాతమనడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఐఎండీ లెక్కల ప్రకారంగా 2023-24 సంవత్సరానికి సాధారణం కంటే 14శాతం ఎక్కువ వర్షపాతం నమోదయిందని కేటీఆర్(KTR) ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
KTR Criticizes CM Revanth Reddy : అబద్దాలు అలవికానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సత్యదూరం మాటలతో ప్రవర్తించడాన్ని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. రైతు సమస్యలు తీరుస్తామనడం అటుంచి, తెలంగాణ రైతాంగానికి మూడు నెలల్లోనే స్కాంగ్రెస్ చేతగానితనం పూర్తిగా అర్థమయ్యిందంటూ విమర్శించారు.
KTR On Gujarat Model : ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి గుజరాత్ మోడల్‌ను కొనియాడటంపై కేటీఆర్ స్పందించారు. రేవంత్‌కు తెలంగాణ ఆత్మలేదని, రాష్ట్రంపై గౌరవం అంతకన్నా లేదని కేటీఆర్ ఆరోపించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోదీ(PM Modi) సాక్షిగా రేవంత్ దాడి చేశారని మండిపడ్డారు. ఘనమైన గంగా జమునా తెహజీబ్ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ నచ్చిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నిన్నటి దాకా గుజరాత్ మోడల్‌పై నిప్పులు, ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలా అని అడిగారు.
'చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు' - మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ మోడల్ అంటే సమున్నత సంక్షేమ నమూనా అని, సమగ్ర అభివృద్ధికి చిరునామా అని కేటీఆర్ వెల్లడించారు. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించపరుస్తారా? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన అంటూ కేటీఆర్ ఘాటు విమర్శలు సంధించారు. తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోదన్నారు. నాడు రాష్ట్ర ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది బీఆర్ఎస్(BRS) అని, నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది కాంగ్రెస్ అని కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలో కాలం తెచ్చిన కరవు లేదు - కాంగ్రెస్ తెచ్చిన కరవే ఉంది : కేటీఆర్
కాంగ్రెస్ వచ్చాక అన్ని పనులను క్యాన్సిల్ చేస్తోంది - వారికి ఏం చేతకాదు : కేటీఆర్