ETV Bharat / state

తెలంగాణలో అదానీ కంపెనీకి స్వాగతం పలకడం - కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం : కేటీఆర్ - KTR Comments on Congress - KTR COMMENTS ON CONGRESS

KTR Comments on Congress Over Adani Group Issue : హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం అదానీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారని బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అదానీ వల్ల దేశానికి నష్టం అన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం లాభమెలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ నిర్వాకాన్ని నిలదీసే ధైర్యం చేయగలరా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

KTR Comments on Rahul Gandhi
KTR Comments on Congress Over Adani Group Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 10:10 PM IST

KTR Comments on Congress Over Adani Group Issue : హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం అదే అదానీ కంపెనీకి స్వాగతం పలకడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అదానీపై జాతీయ కాంగ్రెస్​కు ఒక నీతి ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​కు మరో నీతా అని రాహుల్ గాంధీని విమర్శించారు. అదానీ-సెబీ ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తున్నారు కానీ, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీకి స్వయంగా రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఆక్షేపించారు.

అదానీ కంపెనీకి ద్వారాలు తెరుస్తూ విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏకంగా అదానీకే అప్పగిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తే అదానీ కాంగ్రెస్ మిలాఖాత్, లోపాయికారీ ఒప్పందాలపై తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని రాహుల్ గాంధీకి స్పష్టంచేశారు. అదానీ వల్ల దేశానికి నష్టం అన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం లాభమెలా అవుతుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో అదానీ పెట్టుబడులు : తెలంగాణలో అదానీ కంపెనీల ఆగమనాన్ని రాహుల్ గాంధీ ఆపగలరా కాంగ్రెస్ సీఎం నిర్వాకాన్ని నిలదీసే ధైర్యం చేయగలరా అని ప్రశ్నించారు. అదానీ పెట్టుబడులకు ఫుల్ స్టాప్ పెట్టగలరా సీఎం రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేయగలరా అని పేర్కొన్నారు. అంత శక్తి రాహుల్ గాంధీకి ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ విషయంలో దిల్లీ కాంగ్రెస్ ది ఒకమాట, గల్లీ కాంగ్రెస్ ది మరో మాటనా అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్నట్లు చెబుతున్న పోరాటంలో చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం : జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్​లో ద్వంద్వ వైఖరి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం కాదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండు నాల్కల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాల్ని కూడా నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన పాపానికి తెలంగాణను అదానీకి అప్పగించాలని చూస్తే సహించబోమని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు.

బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం - పోచారంను కచ్చితంగా ఓడిస్తాం : కేటీఆర్‌ - KTR On Pocharam Srinivas Reddy

దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో - 8 నెలల్లో ఎందుకింత విధ్వంసం? : కేటీఆర్‌ - KTR TWEET ON TELANGANA CULTIVATION

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.