KTR Ate biryani with BRS Leaders at Paradise Restaurant: బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఎవరైనా కనీసం నెలల్లో ఒక్కసారైనా తినాలని అనుకుంటారు. ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా విందుకు మాత్రం బిర్యానీకే మొగ్గు చూపుతారు. సరదాగా స్నేహితులు కలిసినా బంధువులు ఇంటికి వచ్చినా బిర్యానీ కచ్చితంగా తింటాం. ఇక బయటకు వెళ్తే మాత్రం కచ్చితంగా బిర్యానీ తినాలని అనుకుంటాం.
ఈ నేపథ్యంలో బిర్యానీ అంటే మొదట గుర్తొచ్చేది హైదరాబాద్. ఇక హైదరాబాద్‌లో ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్ అంటే ముందుండే వాటిలో ఒకటి ప్యారడైజ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి సినిమా తారల వరకూ ఈ బిర్యానీకి అభిమానులే. ఇక హైదరాబాదీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఇవాళ ఈ రెస్టారెంట్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి తమ పార్టీ నేతలతో వచ్చి సందడి చేశారు.
ఇవాళ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సికింద్రాబాద్‌లో ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ముగిసే సమయానికి లంచ్ టైమ్ అయింది. అప్పుడు ఇంటికి వెళ్లడం ఎందుకు అని పక్కనే ప్యారడైజ్ రెస్టారెంట్‌కు ఓసారి వెళదాం అని అనుకున్నారు. అందరు నేతలతో కలిసి కేటీఆర్ ప్యారడైజ్‌కు వెళ్లారు. కేటీఆర్‌ను చూడగానే రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్స్ ఆయనతో ఫోటీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. కేటీఆర్ కూడా సెల్ఫీలు దిగి వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు.
రెస్టారెంట్లో సందడి వాతావరణం: హోటల్ సిబ్బంది కూడా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో కాసేపు రెస్టారెంట్లో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం నేతలతో కలిసి కేటీఆర్ బిర్యానీ తిన్నారు. చివర్లో బిర్యానీ సూపర్ అంటూ ప్యారడైజ్ మేనేజ్మెంట్ను మెచ్చుకున్నారు. అక్కడున్న వారు కేటీఆర్ సింప్లిసిటీని మెచ్చుకున్నారు. ఇటీవలే నాంపల్లిలోని ఓ టీ స్టాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ టీ తాగారు. అక్కడున్న వారు కూడా కేటీఆర్‌ను చూసి తీసుకోవడానికి ఎగబడ్డారు. ఈ విందులో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
అంటరానితనం భారత్‌లో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు - కులవివక్ష ఉందని ఒప్పుకుందామన్న రాహుల్
'సర్టిఫికెట్ కావాలంటే కోరిక తీర్చాల్సిందే' - వీడియో కాల్లో అడ్డంగా బుక్ అయ్యాడుగా!