Kotwalguda Eco Park in Hyderabad : ఔటర్ రింగ్‌రోడ్డు వెంబడి హిమాయత్‌సాగర్ చెంత సిద్ధం చేసిన కొత్వాల్‌గూడ ఎకో పార్కు సందర్శకుల కోసం సిద్ధమవుతోంది. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా డిసెంబరు 9న దీన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చకచక ఏర్పాట్లు చేస్తోంది. వీటితో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో నిర్మాణం చేస్తున్న కాలనీ పార్కులనూ అందుబాటులోకి తేనున్నారు.
ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని దాదాపుగా 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్‌గూడ ఎకో పార్కుకు శ్రీకారం చుట్టారు. రెండేళ్ల కిందట హెచ్‌ఎండీఏ ఈ పార్కు నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్కులో మొదటి దశ పనులు లక్ష్యం మేరకు పూర్తయ్యాయి. మొత్తం రూ.300 కోట్ల భారీ అంచనా వ్యయంతో దీనిని అంతర్జాతీయ స్థాయిలో రూపోందిస్తున్నారు.
నగర శివారు ప్రాంతంలో ఉన్న కొత్వాల్ గూడ ఎకో పార్కును పక్కనే హిమాయత్‌సాగర్ ఉంది. ఏడాది పొడవునా నిండుగా ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది సందర్శకులు ఈ జలాశయం చూసేందుకు వస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలోనే హెచ్‌ఎండీఏ చేపట్టిన ఎకో పార్కుతో ఎంతో మందికి కనులవిందుగా మారనుంది. ఇందులో భాగంగానే అతిపెద్ద అక్వేరియం అత్యంత ప్రత్యేకంగా ఉండనుంది.
మొదటి విడతలో : ఎకో పార్కులో తొలి విడతలో ఎలివేటెడ్ వాక్‌వే(నడక దారి), పక్షుల గ్యాలరీ, వివిధ రకాల పూలతో కూడిన ఉద్యానవనం, బటర్‌ఫ్లై పార్కు, పార్కులో అందంగా తీర్చిదిద్దిన పచ్చికబయళ్లను(గడ్డి) సందర్శకులకు అందుబాటులోకి తేనున్నారు.
రెండో దశలో : ఫేజ్-11 కింద అక్వేరియం, ఇతర ప్రకృతి అందాలు, థీమ్ పార్కులు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి.
ఇవీ ప్రత్యేకతలు
- అందమైన ప్రకృతి రమణీమైన ల్యాండ్‌స్కేపింగ్
- వివిధ రకాల ఆటలు, సాహసాలతో అడ్వెంచర్ జోన్
- దేశంలోనే అతి పెద్దదైన ఏవియరీ
- లగ్జరీ రిసార్టుతో పాటు మినీ కన్వెన్షన్ సెంటర్
- సముద్ర జీవులతో అక్వేరియం
- 2.5 కిలోమీటర్ల దూరంతో కూడిన ఏలివేటెడ్ వాక్ ప్రాంతం
- అవుటర్ రింగ్‌రోడ్డుకు అటు, ఇటు రాకపోకలు సాగించేందుకు సస్పెన్షన్ వంతెన
చూడ్డానికి రెండు కళ్లు చాలని కొత్వాల్‌గూడ ఎకో పార్క్ - వారెవ్వా! ఏంటి బ్రో ఆ సదుపాయాలుహైదరాబాద్‌లో మరో జూపార్క్- రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక - Zoo Park in Fourth City