Kodi Kathi Srinu Family Members Initiation: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్ష శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరింది. సీఎం జగన్ కోర్టుకు హాజరై సాక్షం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శ్రీను తల్లి, సోదరుడి దీక్షకు సమతా సైనిక్ దళ్ మద్దతు ప్రకటించింది. చేయని నేరానికి అన్యాయంగా శ్రీను శిక్ష అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడు జైల్లో మగ్గిపోతుంటే తల్లి ఆవేదన సీఎం జగన్‌కి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దళితుల మనిషి అయితే కోడికత్తి కేసులో ఎందుకు కోర్టుకు రాలేదని ప్రశ్నించారు.
కోడికత్తి కేసు శ్రీనివాస్ కుటుంబానికి అన్యాయం జరిగిందని ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఫారుక్ షిబ్లీ అన్నారు. విజయవాడ శ్రీరామా ఫంక్షన్ హాలులో శ్రీను తల్లి, సోదరుడు దీక్ష చేపట్టగా వారికి సమతా సైనిక్ దళ్ మద్దతు తెలిపింది. జగన్ కోర్టుకు హాజరై సాక్షం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శ్రీను తల్లి, సోదరుడికి అండగా సమతా సైనిక్ దళ్ ఉంటుందని ఫారుక్ హామీ ఇచ్చారు. చేయని నేరానికి అన్యాయంగా శ్రీను శిక్ష అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడు జైలులో మగ్గిపోతుంటే ఆ తల్లి ఆవేదన సీఎం జగన్‌కి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా జగన్ దళితుల మనిషి అయితే కోడికత్తి కేసులో ఎందుకు కోర్టుకు రావడం లేదని నిలదీశారు. ఐదేళ్లవుతున్న శ్రీను కుటుంబానికి న్యాయం జరగడం లేదని ధ్వజమెత్తారు.
ఐదేళ్లైనా తెగని కేసు - న్యాయం కోసం జైల్లోనే నిందితుడి దీక్ష, తల్లి, సోదరుడు సైతం
కోడి కత్తి కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న శ్రీను విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో విచారణకు హాజరవుతున్నాడు. 2018 అక్టోబర్ 25న జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయనపై దాడి జరిగింది. కోడి పందేల్లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడన్న అభియోగాలతో అక్కడున్న శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాటి నుంచి ఐదేళ్లుగా విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు (NIA Court) లో కేసు విచారణ కొనసాగుతోంది. కేసులో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ తేల్చినా శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు.
నిందితుడిగా పేర్కొన్న శ్రీను తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తున్నారు. సీఎం జగన్ (CM Jagan) స్వయంగా కోర్టుకు హాజరుకావాలని లేదా బెయిల్ ఇవ్వాలని శ్రీను తరఫు న్యాయవాది సలీం కోర్టుకు విన్నవిస్తున్నారు. కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ ఇప్పటికే చెప్పిందని శ్రీను తరఫు న్యాయవాది గుర్తు చేశారు. జగన్ ఎన్‌వోసీ అయినా ఇవ్వాలి, వాదనలైనా వచ్చి వినిపించాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ శ్రీనివాస్ జైలులోనే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. మరో వైపు శ్రీను తల్లి, సోదరుడు సైతం దీక్ష కొనసాగిస్తుండగా టీడీపీ నేతలతో పాటు పలు సంఘాల నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు.
జగన్ అధికారంలోకి రావడానికే కోడికత్తి కుట్ర ఘటన- న్యాయవాది సలీమ్