Kishan Reddy fires on Congress and BRS : రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచి కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పీఎల్.శ్రీనివాస్ పలువురు ఇతర పార్టీలకు చెందినవారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పీఎల్ శ్రీనివాస్ లాంటి అనుభవజ్ఞులైన నాయకుల సేవలను బీజేపీ వినియోగించుకుంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో నీతివంతమైన, శక్తివంతమైన ప్రభుత్వంగా మరోసారి నరేంద్ర మోదీని ప్రధాని చేయాలనే కాంక్ష దేశ ప్రజల్లో బలంగా ఉందన్నారు. రాష్ట్రంలో తాజా, మాజీ ప్రభుత్వాల వైఖరి ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు.
"రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచి కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకాబోతుంది. దేశంలో నీతివంతమైన శక్తివంతమైన ప్రభుత్వంగా మరోసారి నరేంద్ర మోదీని ప్రధాని చేయాలనే కాంక్ష దేశ ప్రజల్లో బలంగా ఉంది. దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుంది. రాష్ట్రంలో తాజా, మాజీ ప్రభుత్వాల వైఖరి ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉంది". - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
టార్గెట్ 17 ఎంపీ స్థానాలు - ఈనెల 20 నుంచి బస్సు యాత్రలు : కిషన్‌రెడ్డి
Kishan reddy in sant sevalal jayanti : ఉదయం ఆయన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రిటీష్ మత మార్పిడులకు వ్యతిరేకంగా సంత్ సేవాలాల్ పోరాటం చేశారని కిషన్ రెడ్డి కొనియాడారు. సాంఘీక దురాచారాలను రూపుమాపేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. నేటి యువత సంత్ సేవాలాల్ చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
బంజారా సమాజం హక్కులు, ఆర్థిక స్వావలంబన కోసం బీజేపీ పని చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించామన్న కిషన్‌రెడ్డి, బంజారా సమాజం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఎండగట్టమే లక్ష్యంగా బీజేపీ యాత్రలు : ఎంపీ లక్ష్మణ్
17 ఎంపీ సీట్లే లక్ష్యం - లోక్‌సభ ఎన్నికల కోసం 35కు పైగా బీజేపీ కమిటీలు