ETV Bharat / state

బెంగళూరు డాక్టర్లు చేతులెత్తేస్తే - అనంతపురం డాక్టర్లు ప్రాణం నిలిపారు - Rare Surgery to Pancreas - RARE SURGERY TO PANCREAS

Doctors Perform Rare Surgery to Pancreas : ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే స‌మ‌యం నుంచే ఉన్న మ‌ద్య‌పానం అల‌వాటు, ఓ యువ‌కుడి ప్రాణాల మీద‌కు తీసుకొచ్చింది. 16 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్ప‌టి నుంచి మ‌ద్య‌పానానికి అల‌వాటైపోయిన ఓ యువ‌కుడికి దాని కార‌ణంగా పాంక్రియాస్ (క్లోమం) బాగా పాడైపోయి, కుళ్లిపోయిన స్థితికి చేరుకోవ‌డంతో ప్రాణాపాయం ఏర్ప‌డింది. ఇన్ఫెక్ష‌న్ తీవ్ర‌స్థాయిలో వ్యాపించ‌డంతో శ‌స్త్రచికిత్స చేసినా బ‌తికే అవ‌కాశాలు దాదాపు లేవ‌నే బెంగ‌ళూరులోని ప‌లు ఆస్ప‌త్రుల వైద్యులు అస‌లు కేసు తీసుకునేందుకే ఇష్ట‌ప‌డ‌లేదు. అలాంటి కేసులో అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రి వైద్యులు అత్యంత సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స చేయ‌డ‌మే కాక‌, రోగి ప్రాణాల‌ను విజ‌య‌వంతంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు డాక్ట‌ర్ ఎన్.మ‌హ్మ‌ద్ షాహిద్ వివరించారు.

Doctors Perform Rare Surgery to Pancreas In Anantapur
Doctors Perform Rare Surgery to Pancreas In Anantapur (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 5:25 PM IST

Doctors Perform Rare Surgery to Pancreas In Anantapur : 'ఏపీలోని హిందూపురానికి చెందిన 26 ఏళ్ల లోకేశ్​కు ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే స‌మ‌యం నుంచి మ‌ద్య‌పానం అల‌వాటు ఉంది. కొంత‌మందిలో దానివ‌ల్ల మ‌రీ అంత స‌మ‌స్య‌లు రాక‌పోయినా, కొంద‌రికి మాత్రం శ‌రీర త‌త్వం కార‌ణంగా తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. లోకేశ్​కు పాంక్రియాస్ చుట్టూ నీరు చేరి, ఒక గోడ‌లా త‌యారైపోవ‌డ‌మే కాక‌ బాగా చీముప‌ట్టి విప‌రీత‌మైన ఇన్ఫెక్ష‌న్ (నెక్రోసిస్‌)కు దారి తీసింది. అత‌డు బీఎస్సీ ఎన‌స్థీషియా టెక్నాల‌జీ చ‌దువుతూ వైద్య‌ రంగంలోనే ఉన్నాడు. స‌మ‌స్య వ‌చ్చిన మొద‌ట్లో చూపించుకున్న‌ప్పుడు మెడిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు డాక్ట‌ర్ మ‌నోజ్‌కు చూపించారు. ఆయ‌న కొన్ని మందులు ఇచ్చి, శ‌స్త్రచికిత్స అవ‌స‌రం అవుతుంద‌ని చెప్పారు.

బతికే అవకాశం లేదన్నారు : దాంతో రోగిని అత‌డి బంధువులు బెంగ‌ళూరు తీసుకెళ్లారు. అక్క‌డ మూడు నాలుగు పెద్ద‌పెద్ద ఆస్పత్రుల‌కు తిరిగారు. ఇలాంటి కేసులో శ‌స్త్రచికిత్స చేయ‌క‌పోతే బ‌తికే అవకాశాలు దాదాపు ఉండ‌వు. ఒక‌వేళ చేసినా, 60-70 శాతం మంది చ‌నిపోతారు. బ‌తికే వారిలో కూడా జీవితాంతం ఏదో ఒక స‌మ‌స్య‌ వ‌స్తూనే ఉంటుంది. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితి ఉండ‌టంతో బెంగ‌ళూరు ఆస్ప‌త్రుల‌్లో వైద్యులెవ‌రూ ఈ కేసు తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు.

ఇన్ఫెక్ష‌న్ తీవ్ర‌స్థాయిలో ఉండ‌టంతో పాటు గుండె రేటు కూడా గ‌ణ‌నీయంగా పెరిగిపోయింది. ర‌క్త‌పోటు ప‌డిపోయింది. క్లోమం పూర్తిగా పాడైపోవ‌డంతో దాన్ని తొల‌గించ‌క త‌ప్ప‌లేదు. ఇన్ఫెక్ష‌న్ పేగుల‌కు కూడా విస్త‌రించ‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా స్టోమా చేశాం. దీన్ని మ‌రో రెండు మూడు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ లోప‌ల పెట్టేస్తాం.

నక్షత్ర హాస్పిటల్​లో కాలేయానికి సంబంధించి అరుదైన శస్త్ర చికిత్స - Liver Rare Surgery in Hospital

ఈ శ‌స్త్రచికిత్స త‌ర్వాత లోకేశ్​ పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాంక్రియాస్‌ను తొల‌గించ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో అత‌డికి క‌చ్చితంగా మ‌ధుమేహం వ‌స్తుంది. ఇన్ఫెక్ష‌న్లు వ్యాపించే ప్ర‌మాదం కూడా ఉంటుంది. మ‌ధుమేహ నియంత్ర‌ణ‌కు టాబ్లెట్లు గానీ, ఇన్సులిన్ గానీ వాడాల్సి ఉంటుంది. మ‌ద్య‌పానానికి పూర్తిగా దూరం కావాలి. ఇన్ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి” అని డాక్ట‌ర్ మ‌హ్మ‌ద్ షాహిద్ వివ‌రించారు.

జీవితాంతం జాగ్రత్తలు పాటించాల్సిందే : హైద‌రాబాద్, బెంగ‌ళూరు లాంటి పెద్ద న‌గ‌రాల్లో ఇలాంటి శస్త్రచికిత్స‌ల‌కు దాదాపు రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. దీన్ని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రిలో కేవ‌లం రూ.2 ల‌క్ష‌ల‌కే చేశారు. ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడినందుకు డాక్ట‌ర్ మ‌హ్మ‌ద్ షాహిద్‌కు, కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి లోకేశ్​, అత‌డి త‌ల్లిదండ్రులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సనత్​నగర్​ ఈఎస్​ఐ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స - ESIC Laparoscopic Surgery Success

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన - ఎన్​ఆర్​ఐ ప్రమేయంతో చిన్నారి మహాన్​కు చికిత్స - NRI HELPS FOR CHILD BRAIN SURGERY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.