ETV Bharat / state

మిస్టరీగా కిడ్నీవ్యాధి కారణాలు- ఆదుకోవాలని వేడుకుంటున్న గ్రామస్థులు - kidney disease in NTR district

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 7:46 PM IST

Kidney Disease Problems in Anumullanka Village of NTR District : ఆ గ్రామాన్ని కొన్నేళ్లుగా మూత్రపిండాల వ్యాధులు పీల్చిపిప్పి చేస్తున్నాయి. పదలు సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. వ్యాధి కారకం అంతు చిక్కడం లేదు. వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహించిన లాభం లేదు. ఇంతకి ఆ గ్రామం ఏదీ? ఎక్కడా ఉంది? వ్యాధితో గ్రామస్థులు చేస్తోన్న పోరాటం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Kidney Disease Problems in Anumullanka Village of NTR District
Kidney Disease Problems in Anumullanka Village of NTR District (ETV Bharat)

Kidney Disease Problems in Anumullanka Village of NTR District : ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుముల్లంక గ్రామాన్ని మూత్రపిండాల వ్యాధులు పీల్చిపిప్పి చేస్తున్నాయి. నెల వ్యవధిలోనే కిడ్నీ వ్యాధులతో ముగ్గురు చనిపోగా 50 మందికి పైగా వ్యాధితో పోరాడుతున్నారు. వృద్ధులు, యువకులనే తేడా లేకుండా అందరికీ కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కిడ్నీ వ్యాధికి కారణాలను గుర్తించి తమను కాపాడాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

కిడ్నీ వ్యాధులకు చెక్‌ పెట్టేలా సర్కార్‌ ప్రణాళికలు - బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు - KIDNEY PATIENTS HOPE

ఎవరినీ కదిపినా కిడ్నీ సమస్యే : ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుముల్లంక గ్రామంపై కిడ్నీ వ్యాధులు పంజా విసురుతున్నాయి. 3వేల జనాభా ఉండే ఈ గ్రామంలో ఎవరినీ కదిపినా కిడ్నీ సమస్యపైనే గోడు వినిపిస్తున్నారు. గత రెండేళ్లలో గ్రామంలో 8 మంది మూత్రపిండాల వ్యాధులతో మరణించగా గడిచిన రెండు నెలల కాలంలో ముగ్గురిని కిడ్నీ వ్యాధి పొట్టనపెట్టుకుంది. గ్రామంలో ప్రస్తుతం 50 మందికిపైగా బాధితులు ఉన్నారు.

కారణమేంటన్నది ఇప్పటికి ఇతమిత్థం : రోగులంతా పేద, మధ్యతరగతి ప్రజలే. కిడ్నీ వ్యాధి పంజా విసరడంతో కుటుంబాలను ఎలా నెట్టుకురావాలో తెలియక సతమతమవుతున్నారు. రోగుల్లో చాలామంది తిరువూరు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. మరికొందరు మందులతో సరిపెట్టుకుంటున్నారు. నెలకు కనీసం రెండున్నర వేల నుంచి 4వేల రూపాయల వరకు మందులకు ఖర్చవుతోందని బాధితులు చెబుతున్నారు. వైద్య పరీక్షలకు ఒక్కోసారి విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కిడ్నీ వ్యాధి రావడానికి కారణమేంటన్నది ఇతమిత్థంగా తెలియకపోయినా తాగునీటిలో ప్లోరిన్, సిలికాన్ వంటి మూలకాలు ఉండటమే కారణమని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.

"గ్రామంలో ప్రభుత్వం వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కారణమేంటన్నది గుర్తించలేకపోయారు. ఎప్పుడు ఎవరికి కొత్తగా సోకుతుందోనని భయాందోళనతో గ్రామస్థులంతా అల్లాడుతున్నారు. ప్రస్తుతం కొద్దిమంది బాధితులకే పింఛన్ అందుతోంది. కిడ్నీ వ్యాధి బారినపడిన వారందరికీ పింఛన్ అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలాగే మందులు బయట కొనలేకపోతున్నాం, ప్రభుత్వమే ఉచితంగా మందులు అందించి ఆదుకోవాలి." - అనుముల్లంక గ్రామస్థులు

కిడ్నీ రాకెట్ వార్తలపై హోంమంత్రి అనిత ఆగ్రహం - హాస్పిటల్​పై చర్యలు తీసుకోవాలని ఆదేశం - Home Minister

అలర్ట్ : కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి! - లైట్‌ తీసుకుంటే అంతే! - Kidney Failure Symptoms

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.