Kidney Disease Problems Afflicting Tribals in NTR District : ఎన్టీఆర్ జిల్లాలోని ఏకైక గిరిజన మండలమైన ఎ.కొండూరులో కిడ్నీవ్యాధి తీవ్రత పెరుగుతోంది. 15 గిరిజన తండాలు మూత్రపిండ వ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా మారాయి. ఒక్కో తండాల్లో 20 నుంచి 30 బాధితులు వరకు ఉంటున్నారు. నాలుగు పదుల వయసులోనే బాధితులు మృతి చెందుతున్నారు. జలజీవన్ మిషన్ కింద గిరిజన తండాల్లో కృష్ణ జలాల ప్రాజెక్టు చేపడతామంటూ కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కనీసం దస్త్రం కూడా ముందుకు కదల్లేదు. సీఎం హోదాలో జగన్ తిరువూరు నియోజకవర్గంలో పర్యటించి స్వచ్ఛ జలాల ప్రాజెక్టు కోసం రూ. 50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు. తండాల్లో ఇప్పటికీ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.
కిడ్నీ వ్యాధితో పెద్దసంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్నారని ఇటీవల వామపక్ష నేతలు ఆందోళన బాట పట్టారు. మండలంలో ఇప్పటికీ 2 వేల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, 110 మందికి పైగా డయాలసిస్ చేయించుకుంటున్నారని సీపీఎం నేతలు అన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు, గంపలగూడెం మండలాల్లో సమస్య తీవ్రంగా ఉందన్నారు.
కిడ్నీ వ్యాధి సమస్యను చర్చించడానికి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఎ.కొండూరు గ్రామానికి నిపుణుల బృందాన్ని పంపించి కిడ్నీ వ్యాధికి కారణాలను నిర్థారించండి. కిడ్నీ బాధిత గ్రామాలకు తక్షణమే మంచి నీళ్లు ఇవ్వండి. డయాలసిస్ పేషెంట్లకు రూ.20 వేల పెన్షన్ ఇవ్వాలి. వారికి మందులను ఉచితంగా ఇవ్వండి. తిరువూరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి ఏర్పాటు చేయండి -బాబూరావు, సీపీఎం నాయకుడు
ఆస్పత్రికి ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగులు - చికిత్స కోసం వెళ్లి నానా అవస్థలు - Ongole Rims Hospital
శరవేగంగా కృష్ణా జలాల ప్రాజెక్టు పనులు : ప్రభుత్వ ఆదేశాలతో ఎ.కొండూరు మండలంలోని కిడ్నీవ్యాధుల ప్రభావిత గ్రామాలకు సురక్షిత కృష్ణా జలాలను అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. 38 గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన కృష్ణా సురక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 49.94 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది జూన్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం మైలవరం సీపీడబ్ల్యూసీ స్కీమ్ (CPWC Scheme) వరకు కృష్ణా జలాలు వస్తున్నాయని అక్కడి నుంచి కుదపలోని సంప్ దగ్గరకు జలాలను తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ సంప్ నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా ఎ.కొండూరు మండలంలోని వివిధ గ్రామాలకు అందిస్తున్నట్లు వివరించారు. శాశ్వత ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవరకు ఈ విధంగా తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా కిడ్నీ వ్యాధుల ప్రభావిత గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిలో వసతుల లేమి - నానా అవస్థలు పడుతున్న రోగులు - Uddanam Kidney Hospital