ETV Bharat / state

పల్నాడు జిల్లాలో కలకలం రేపిన కిడ్నాప్ - ఆరుగురు అరెస్టు - Police Chase in KIDNAP CASE - POLICE CHASE IN KIDNAP CASE

Police Chase Vinukonda Kidnap Case: పల్నాడు జిల్లాలో వెంకుపాలెం సమీపంలో కిడ్నాప్ ఘటనను పోలీసులు ఛేదించారు. ఆటోలో కూరగాయలు విక్రయించేందుకు వెళ్తున్న వారిని దుండగులు కారులో వచ్చి దాడి చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మా గ్రామానికి చెందిన వారే నా కుమారుడిని కిడ్నాప్​ చేశారని బాధితుడి తల్లి పేర్కొన్నారు.

POLICE CHASE IN KIDNAP CASE
POLICE CHASE IN KIDNAP CASE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 11:42 AM IST

పల్నాడు జిల్లాలో కలకలం రేపిన కిడ్నాప్ - ఆరుగురు అరెస్టు (ETV Bharat)

Police Chase Vinukonda Kidnap Case in Palnadu District : పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో వ్యక్తిపై దాడి చేసి ఆపై కారులో ఎత్తుకెళ్లిన ఘటన సుఖాంతమైంది. బాధితుడిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం వెంకుపాలెం సమీపంలోని నగరవనం వద్ద నాగరాజు అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్‌ చేయడం సంచలనంగా మారింది. వినుకొండలోని తన చెల్లి వద్ద గత రెండు నెలలుగా నివాసముంటున్న నాగరాజు, చెల్లి అంకమ్మ, బావ రవితో కలిసి కూరగాయలు విక్రయించేందుకు ఆటోలో వెళ్తుండగా దుండగులు అడ్డుకున్నారు.

Venkupalem Kidnap Case : కారుతో ఆటోను అడ్డుకుని నాగరాజును కొట్టి కారులో ఎక్కించుకున్నారు. అడ్డుకోబోయిన అతడి బావ రవిపైనా దండుగులు దాడి చేయగా ఆయనకు తలపై గాయమైంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. దీనిపై ఆటోలోని మిగతా ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోలో ఉన్న మహిళలను విచారించారు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు కిడ్నాపర్ల కదలికలు గుర్తించి గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో బొల్లాపల్లి పీఎస్​ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి చెర నుంచి బాధితుడు నాగరాజును విడిపించారు.

గూడూరులో పట్టపగలే బంగారం వ్యాపారి కిడ్నాప్‌ - కారణం అదేనా? - Gold Business Man Kidnap

నాగరాజును కిడ్నాప్‌ చేసిన వారిలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు సీఐ శోభన్‌బాబు తెలిపారు. మిగిలిన వారు తప్పించుకున్నారని, ఘటన జరిగిన వెంటనే బొల్లాపల్లి పోలీసులను అప్రమత్తం చేయడంతో కిడ్నాపర్లను పట్టుకోగలిగినట్లు సీఐ పేర్కొన్నారు. అయితే బాధితుడు నాగరాజును మీడియాకు సైతం చూపకుండా రహస్యంగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి తొమ్మిదిన్నర గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బంధువులకు బాధితుడిని పోలీసులు అప్పగించి వెళ్లిపోయారు. కిడ్నాప్‌నకు గురైన వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మా గ్రామం వాళ్లే చేశారు: నా కుమారుడు నాగరాజును మా గ్రామానికి చెందిన టంగుటూరి కొండలు, మల్లికార్జునరావు, కంచర్ల రామాంజి, ఆవుల జాలయ్య, ఆరెద్దుల మణి, మరో ముగ్గురు కలిసి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని నాగరాజు తల్లి అంకమ్మ తెలిపారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ శోభన్‌బాబు, ఎస్సై స్వర్ణలత వచ్చి గాయపడ్డ రవిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తన కుమారుడికి గతంలో గ్రామంలో జరిగిన జల్లయ్య హత్యతో సంబంధం లేదని, చిన్నపాటి గొడవలో కేసు పెట్టడంతో నెల్లూరు జైలుకెళ్లి వచ్చాడని వైద్యశాలలో నాగరాజు తండ్రి సాంబ తెలిపారు.

రషీద్ హత్య కేసులో మరో ఆరుగురు అరెస్టు - మరికొందరి కోసం గాలింపు - Six Persons Arrest in Rashid Case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.