ETV Bharat / state

డార్క్ ​వెబ్​ ద్వారా డ్రగ్స్ కొనుగోలు - సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు - police caught the drug buyer

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 9:01 PM IST

Police Caught The Drug Buyer : డార్క్ ​వెబ్​ ద్వారా డ్రగ్స్​ కొనుగోలు చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను తెలంగాణ నార్కోటిక్​ పోలీసులు పట్టుకున్నారు. సదరు వ్యక్తి మాదక ద్రవ్యాలను వెబ్​ద్వారా ఆర్డర్​ చేస్తున్నాడనే సందేహం కలిగి, అతడి కదలికలపై నిఘా పెట్టారు. అనంతరం టెకీని అరెస్ట్​ చేసి, అతని తల్లిదండ్రుల సమక్షంలో అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Police Caught The Drug Buyer
Police Caught The Drug Buyer (ETV Bharat)

Police Caught The Drug Buyer : రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏదో ఓ చోట ఇంకా డ్రగ్స్​ మాట వినిపిస్తూనే ఉంది. కొంతమంది అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చెడు వ్యసనాలకు ఉపయోగిస్తున్నారు. డార్క్​వెబ్​ ద్వారా డ్రగ్స్​ను కొనుగోలు చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఓ టెకీని తెలంగాణ పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం అతని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్​ ఇచ్చారు.

డ్రగ్స్​ కొంటున్నాడని అనుమానం కలిగి : వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి మాదక ద్రవ్యాలను డార్క్ ​వెబ్ ​ద్వారా ఆర్డర్​ చేస్తున్నాడనే సందేహం కలిగి అతడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. జులై 31వ తేదీన డార్క్​ వెబ్​ ద్వారా రాష్ట్రానికి డ్రగ్స్​ వస్తున్నట్లు పక్కా సమాచారంతో అతనిపై దృష్టి పెట్టారు. అసోం నుంచి స్పీడ్​ పోస్టులో ఖమ్మం జిల్లాకు మత్తు పదార్థాలు వస్తున్నట్లుగా సమాచారం తెలుసుకున్నారు.

కౌన్సెలింగ్​ ఇచ్చిన పోలీసులు : ఈ నెల 8న డ్రగ్స్ డెలివరీ చేస్తున్న క్రమంలో టీజీ న్యాబ్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. న్యూస్ పేపర్​లో డ్రగ్స్ చుట్టి ప్లాస్టర్ అంటించి డెలివరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాలు కొనుగోలు చేసిన సమయంలో క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపినట్లు టీజీ న్యాబ్ పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్​ చేసి, అతడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

డ్రగ్స్​ముఠా గుట్టురట్టు : మరో కేసులో గుట్టుచప్పుడు కాకుండా లగేజీ బ్యాగులో తరలిస్తున్న డ్రగ్స్‌ను హైదరాబాద్‌లో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరం నుంచి న్యూజిలాండ్‌కు ఇద్దరు వ్యక్తులు భారీగా మాదకద్రవ్యాలు తరలించేందుకు యత్నించగా, పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

నిందితుల వద్ద నుంచి 3 కిలోల ఎఫెడ్రిన్, సూడోఎఫెడ్రిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులు లగేజీ బ్యాగులో ప్రత్యేకంగా డ్రగ్స్‌ ప్యాకెట్లను అమర్చి న్యూజిలాండ్‌కు కొరియర్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పొడి రూపంలో ఉన్న 2 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిపై ఎన్​డిపీఎస్​ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? ఎవరికి చేరవేస్తున్నారు? ఇంకా ఎంత మంది ఇందులో ఉన్నారనే అంశాలపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు వేవగంతం చేశారు.

'మీ పార్శిల్​లో డ్రగ్స్​ ఉన్నాయి - నేనడిగినంత డబ్బివ్వకపోతే జైలుకెళ్లడం ఖాయం'

Excise Department Focus on Illegal Liquor : అక్రమ మద్యం అమ్మకాలపై ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం.. రూ.10 కోట్ల విలువైన సరకు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.