ETV Bharat / state

'ఇకనుంచి పాలిటిక్స్​కు దూరంగా ఉంటా'- రాజకీయ సన్యాసం తీసుకున్న కేశినేని నాని - Kesineni Nani Sensational Decision

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 7:40 PM IST

Updated : Jun 10, 2024, 10:36 PM IST

Kesineni Nani Sensational Decision on Politics: సార్వత్రిక ఎన్నికలో ఓటమిపాలైన కేశినేని నాని రాజకీయాలకు గుడ్​ బై చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్​లో ప్రకటించారు.

Kesineni_Nani_Sensational_Decision_on_Politics
Kesineni_Nani_Sensational_Decision_on_Politics (ETV Bharat)

Kesineni Nani Sensational Decision on Politics: 2024 ఎన్నికల ముందు జగన్‌ పంచన చేరి ఓటమి పాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణం ముగిస్తున్నట్లు నాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవమని తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా, విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తూనే ఉంటానని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో తన సోదరుడి కేశినేని చిన్న చేతుల్లో నాని ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

"ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటా. నా రాజకీయ ప్రయాణాన్ని ముగించా. రెండుసార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేశా. విజయవాడ అభివృద్ధికి నా వంతు మద్దతిస్తూనే ఉంటా. విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు." - ఎక్స్‌లో కేశినేని నాని ట్వీట్

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులకు ఆహ్వానం

కాాగా కేశినేని నాని ట్వీట్​పై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. కేశినేని నాని రాజకీయాల నుంచి స్వతహాగా తప్పుకోలేదని, ప్రజలే తప్పించారని విమర్శించారు. రాష్ట్రమంతా వైఎస్సార్సీపీ ఓడిపోవడం ఒక ఎత్తు ఐతే నాని ఒక్కడినే విజయవాడ ప్రజలు ఓడించడం మరొక ఎత్తు అని తెలిపారు. గతంలో రెండుసార్లు నానిని పార్లమెంట్​కి పంపిన చంద్రబాబుని పార్టీలోనే ఉంటూ ఇబ్బంది పెట్టినందుకు ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. కేశినేని నానిని పార్లమెంట్​కి పంపిన చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పాలని, మాటలతో ఆయనను బాధపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ట్వీట్ చేశారు.

సీఎంగా చంద్రబాబు పేరును ప్రతిపాదించనున్న పవన్? బాబు ఇంటికి క్యూ కట్టిన ఆశావహులు - MLAs Queuing up to Meet Chandrababu

Last Updated : Jun 10, 2024, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.