Kerala Police Introduce New Portal For Sabarimala Devotees : శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు శుభవార్త చెప్పారు. మండలం-మకరవిళక్కు వార్షిక యాత్ర సందర్భంగా శబరిమల వస్తున్న వారికి సులభంగా దర్శనమయ్యేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చారు. 'శబరిమల పోలీస్ గైడ్' అనే ఈ పోర్టల్ ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టల్‌లో భక్తులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్నంతా పొందుపరిచారు.
పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, కేఎస్ ఆర్టీసీ, అంబులెన్సు, అగ్నిమాపక దళం, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సమాచారం అంతా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సమాచారంతో పాటు శబరిమల చరిత్ర, ప్రతి జిల్లా నుంచి శబరిమలకు ఉన్న వాయు, రైలు, రోడ్డు మార్గాల వివరాలు, వాహనాల పార్కింగ్ వివరాలు ఇందులో పొందుపరిచినట్లు పోలీస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
శబరిమల భక్తులకు శుభవార్త - తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు
కీలక ప్రకటన చేసిన రైల్వే : శబరిమల వెళ్లే యాత్రికుల డిమాండ్ బట్టి జోన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అలాగే ఓ ప్రకటన విడుదలచేసింది. సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. పూజా విధానంలో భాగంగా కొందరు రైలు బోగీల్లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరొత్తులు వెలిగించడం వంటివి చేస్తున్నట్లు గుర్తించారని, అలా చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు సంబవించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
చట్ట ప్రకారం వారికి శిక్ష తప్పదు : రైళ్లలో, రైలు ప్రయాణ ప్రాంగణాల్లో మండే స్వభావం ఉన్న పదార్థాలతో ప్రయాణించడంపై నిషేధం ఉందని వివరించింది. అగ్ని ప్రమాదాలకు బాధ్యులైనవారికి రైల్వే చట్టం-1989 ప్రకారం మూడు సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుందని హెచ్చరించింది. బరిమల యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో యాత్రికులు ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ద.మ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది.
భక్తులకు అలర్ట్ - రైళ్లలో ఇలా చేస్తే మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా
శబరిమల వెళ్లేవారికి గుడ్ న్యూస్ - నిమిషాల్లోనే రూమ్ బుక్ చేసుకోండిలా!