KCR Birthday Celebrations in Telangana : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో 70 కిలోల కేక్ కట్‌చేసి సంబరాలు నిర్వహించారు.
KTR in KCR Birthday Celebrations : తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా వెయ్యిమంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష చొప్పున ఇన్సూరెన్స్ పత్రాలను కేటీఆర్ అందించారు. దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్ఎల్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలు నాటారు. దివ్యాంగ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు - శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ పుట్టినరోజు పురష్కరించుకొని వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య కేక్‌కటింగ్ చేశారు. కామారెడ్డి జిల్లా గాంధీగంజ్‌లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్ కేక్ కట్ చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. డిచ్‌పల్లిలో 30 పడకల ఆసుపత్రిలో స్థానిక బీఆర్ఎస్ నేతలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్‌కు BRS నేత అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా గాల్లోనే..
KCR Birthday Celebrations Siddipet : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులను చెల్లించి ఆలయం ఎదుట కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. జిల్లా నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.
ఆదిలాబాద్‌లోని పార్టీకార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న కేట్ కట్ చేసి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్‌లో భారీ కేకును కట్‌చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆడంబరంగా నిర్వహించారు.
ఘనంగా కేసీఆర్ బర్త్‌డే వేడుకలు.. జననేతకు ప్రముఖుల విషెస్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్‌నగర్, గాంధీనగర్, కవాడిగూడ, బోలక్పూర్, అడిక్‌మెట్ డివిజన్లోని అనేక ప్రాంతాల్లో పేదలకు చీరల పంపిణీ చేశారు. మెగా హెల్త్‌క్యాంప్, అన్నదానం వంటి తదితర సేవా కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు. రామ్‌నగర్‌లోని మోహన్‌నగర్ కమ్యూనిటీ హాల్లో కార్పొరేట్ ఆసుపత్రి మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు.