Karimnagar Girl On Powerlifting : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మర్రిగడ్డకు చెందిన తూడి శ్రీనివాస్, గంగవ్వలు వ్యవసాయ, కూలీ పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. వీరి కుమార్తె తూడి సిరిచందన కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. సాధారణ ఆటలు కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే నిర్ణయంతో ఆ యువతి 2015లో పాఠశాల స్థాయిలోనే పవర్‌లిఫ్టింగ్‌లో కోచ్ మల్లేశం వద్ద శిక్షణ తీసుకుంది.
అదరగొడుతున్న అలికాజో- వుషూ క్రీడలో ఔరా అనిపిస్తున్న హైదరాబాద్ యువతి - national wushu player alikajo
Powerlifting Girl Seeks Financial Support : హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌లో ప్రతిభ చాటిన సిరిచందన జాతీయ స్థాయిలో 52 కేజీల విభాగంలో కేరళ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్రలో పాల్గొని స్వర్ణ, కాంస్య పతకాలు సాధించింది. గత నెలలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జాతీయ ఫెడరేషన్ పవర్‌లిఫ్టింగ్ (Powerlifting) ఛాంపియన్ పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొని తృతీయ స్థానంలో నిలిచింది. ఎన్నో క్రీడలు ఉన్నా పట్టుదలతో పవర్‌లిఫ్టింగ్‌లో తాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సిరిచందన పేర్కొంది. దాతలు ఆర్థిక సహాయం చేస్తే మరిన్ని దేశానికి మరిన్ని పతకాలు తీసుకొస్తానని సిరి చందన చెబుతోంది.
"నేను తొమ్మిది సంవత్సరాల నుంచి పవర్‌లిఫ్టింగ్ చేస్తున్నాను. ఇప్పటికే ఇరవై రాష్ట్ర స్థాయి, మూడు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. నేను హాంకాంగ్‌లో జరిగే ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాను. అక్కడికి వెళ్లేందుకు రూ.3.50 లక్షలు దాకా ఖర్చు అవుతుంది. నా తల్లిదండ్రులు అంత ఖర్చు భరించే స్థోమతలో లేరు. ప్రభుత్వం కానీ దాతలు కానీ స్పందించి ఆర్థిక సహాయం చేయగలరని కోరుతున్నాను. తద్వారా ఈ పోటీల్లో పాల్గొని దేశానికి మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నాను." - తూడి సిరిచందన, పవర్‌లిఫ్టర్
అథ్లెటిక్ కోచ్‌గా ఆదిలాబాద్ అడవి బిడ్డ - గిరిజన విద్యార్థులకు శిక్షణ
జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంతో సిరిచందనకు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటే అవకాశం దక్కింది. మే నెలలో హాంకాంగ్‌లో జరిగే ఏషియన్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది. నాన్ ఒలింపిక్ క్రీడలు కావడంతో హాంకాంగ్ వెళ్లేందుకు ఖర్చు భరించలేని పరిస్థితి ఆమెది. విమాన టికెట్, వీసా, ఇతరత్రా రూ.3 లక్షలు అవసరమవుతాయని ఆమె కోచ్ మల్లేశం తెలిపారు. జాతీయ స్థాయి వేదికల్లో పాల్గొన్న ప్రతిసారి ఆరేడు వేల చొప్పున ఇప్పటికే రూ.70,000లు సొంతంగా ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం కోసం చూస్తున్నప్పటికీ, అంతర్జాతీయ వేదికలో పాల్గొనేందుకు ఎవరైనా దాతలు, సంస్థలు చేయూత అందించాలని మల్లేశం కోరుతున్నారు. అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉన్నా తనకు ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తులు ఎవరైన సహాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తోంది సిరిచందన.
చదువు కెరీర్‌గా, ఆటలు హాబీగా ఎంచుకుని - అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతోన్న స్ఫూర్తి
చైనా యుద్ధ విద్యలో సత్తాచాటుతున్న అన్నాచెల్లెళ్లు - తండ్రి ప్రోత్సాహంతో వుషూ క్రీడలో రాణింపు