ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కార్గిల్ విజయ్​ దివస్ - యుద్ధవీరులకు నివాళులర్పించిన రాజకీయ నేతలు, మాజీ సైనికోద్యోగులు - kargil vijay diwas 2024 - KARGIL VIJAY DIWAS 2024

Kargil Vijay Diwas 2024 : కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాజకీయ పార్టీలు, విద్యార్థులు, మాజీ సైనికులు, పోలీసులు విజయ్‌ దివస్‌ను నిర్వహించారు. అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశభక్తిని చాటుతూ భారీ ర్యాలీలు, జాతీయ జెండాలను ప్రదర్శించారు.

Kargil Vijay Diwas 2024
Kargil Vijay Diwas 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 10:17 PM IST

Kargil Vijay Diwas 2024 : భారత్‌, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించి 25ఏళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రంలో 'విజయ్ దివస్‌'ను ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల జాతీయ జెండాలతో రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. విపత్కర పరిస్థితుల్లోనూ దేశరక్షణకు అంకితమవుతున్న సైనికుల సేవల్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో వందలాది మంది భరతమాత ముద్దుబిడ్డలు దేశ రక్షణలో భాగంగా అమరులయ్యారని గుర్తుచేసుకున్నారు.

పలు జిల్లాల్లో ఘనంగా కార్గిల్​ విజయ్​ దివస్ : కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆదిలాబాద్‌ మున్సిపల్ పార్కులోని స్తూపం వద్ద అమర వీరులకు జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులు, బీజేపీ, హిందూ ఉత్సవ నాయకులు పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీఆర్ఎస్​వీ ఆధ్వర్యంలో జెండా ర్యాలీని నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల పేర్లతో నినాదాలు చేశారు.

కార్గిల్​ యుద్ధవీరులకు నివాళులు : 500 మీటర్ల జాతీయపతాకాన్ని భుజాలపై మోసి ఊరేగించారు. బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్​సీసీ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు స్కూల్ విద్యార్థులు, పోలీసులు విజయ దివాస్ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మాజీ సైనికులు కార్గిల్ అమరులకు నివాళులు అర్పించారు.

నాగర్​కర్నూల్ జిల్లాలో జెండాలతో ర్యాలీ : అమర జవాన్ల స్తూపం వద్ద కార్గిల్ అమరులకు అంజలి ఘటించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. దేశం కోసం అమరులైన సైనికులను స్థానిక నాయకులు స్మరించుకొని పూలమాలలతో నివాళులర్పించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో విద్యార్థి సేన, యువసేన ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ కూడలి వద్ద కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్గిల్​ యుద్ధంలో భారత ఆర్మీ జవాన్లు ప్రదర్శించిన ధైర్య సహాసాలను గుర్తు చేసుకున్నారు.

కార్గిల్ ప్రత్యేకం: మంచు శిఖరంపై మరపురాని విజయానికి 22 వసంతాలు

కార్గిల్​ దివస్​ సందర్భంగా విద్యార్థుల ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.