ETV Bharat / state

కేయూలో అసౌకర్యాలపై విద్యార్థుల ఆందోళన - స్లాబ్‌ పెచ్చులూడిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం - KU Students Protest

KU Students Protest about Hostel Incident : కాకతీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు అక్కడి విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వసతిగృహంలో స్లాబ్‌ పెచ్చులూడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని ఘోరావ్‌ చేసిన ఆందోళనకారులు, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్ధులను వేరే వసతి గృహానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రార్‌ తెలిపారు.

Students Protest in Kakatiya University
KU Students Protest about Hostel Incident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 7:48 PM IST

Students Protest in Kakatiya University : కాకతీయ విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో అసౌకర్యాలు విద్యార్ధులను వెక్కిరిస్తున్నాయి. కూలే పైకప్పులు, విరిగిన తలుపులు, చాలీచాలని బాత్రూంలు, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా వర్సిటీలోని రాణి రుద్రమదేవి వసతి గృహం శిధిలావస్ధకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. ఫలితంగా విద్యార్ధులకు వెతలు తప్పడం లేదు. గత రాత్రి ఇదే వసతి గృహంలోని గదిలో సీలింగ్​పై పెచ్చులు ఊడి కింద పడ్డాయి.

అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. దీంతో వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్ధులు నినాదాలు చేశారు. పదిహేను రోజుల క్రితం ఇదే హాస్టల్‌లో విద్యార్ధినిపై ఫ్యాన్ పడి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో చికిత్స అందడంతో ముప్పు తప్పింది. హాస్టల్‌లో కనీస సదుపాయాలు లేవని, రాత్రైతే భయం భయంగా గడపాల్సి వస్తుందని విద్యార్థులు వాపోయారు. అసౌకర్యాలపై నిర్వాహకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'మేం మెస్​కు వెళ్లి తిని వచ్చాం. కొందరు బయట ఉన్నారు. నేను హాస్టల్​లో ఉన్నా. ఆ సమయంలో చిన్న స్లాబ్‌ పెచ్చు మీద పడింది. వెంటనే అక్కడి నుంచే లేవగానే మొత్తం స్లాబ్‌ పెచ్చులూడి పడింది. అదే కాకుండా ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. ఈ ఘటన మళ్లీ జరిగినా ​రిజిస్ట్రార్‌ మారరు'- విద్యార్థులు

తక్షణం రిజిస్ట్రార్ రాజీనామా చేయాలని డిమాండ్​ : హాస్టల్‌ను చూసేందుకు వచ్చిన రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్ధి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. తక్షణం రిజిస్ట్రార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేరే వసతి గృహానికి తరలించాలని డిమాండ్ చేశారు. వసతి గృహంలో జరిగిన ఘటన దురదృష్టకరమన్న రిజిస్ట్రార్‌ మల్లారెడ్డి, విద్యార్ధులను వేరే హాస్టల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. సమీపంలోని సమ్మక్క, సారలమ్మ మహిళా వసతి గృహంలో విద్యార్థులకు వసతి ఏర్పాటు చేయగా అక్కడా తగిన సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై ఇన్​ఛార్జ్‌ వీసీ వాకాటి కరుణ జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు.

'హాస్టల్​లో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. వెంటనే విద్యార్థులను వేరే హాస్టల్​లో తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. వారం రోజుల క్రితమే విద్యార్థులను షిఫ్ట్​ చేద్దాం అని అనుకున్నాం. కానీ కొత్త కార్డులు వస్తున్నాయని, దాని ప్రకారం కొత్త హాస్టల్​లో షిఫ్ట్​ చేద్దాం అని కొంత ఆలస్యం చేశాం'-మల్లారెడ్డి, వర్సిటీ రిజిస్ట్రార్

కేయూ హాస్టల్‌లో ఊడిపడిన పైకప్పు పెచ్చులు - ఆందోళనకు దిగిన విద్యార్థులు - Slab Collapsed In KU Womens Hostel

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.