ETV Bharat / state

పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతోనే తగులబెట్టాడు: ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు - KADAPA SP ON BADVEL INCIDENT

యువతికి ఐదేళ్లుగా విఘ్నేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఉందన్న ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు - కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారని వెల్లడి

Kadapa_SP_on_Badvel_Incident
Kadapa SP on Badvel Incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2024, 9:25 PM IST

Kadapa SP Harshavardhan Raju on Badvel Incident : వైఎస్సార్ జిల్లా బద్వేలులో దాడి ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ కుట్రప్రకారమే బాలికపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు తెలిపారు. బాలికకు ఐదుళ్లుగా విఘ్నేష్‌తో పరిచయం ఉందని, పెళ్లి చేసుకోమని అడగడం వల్లనే బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వివరించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కడప రిమ్స్‌లో ఇంటర్‌ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. బద్వేల్‌ పెట్రోల్ దాడి ఘటనలో నిందితుడు విఘ్నేష్​ను అరెస్టు చేసి, మీడియా సమావేశంలో వివరాలను ఎస్పీ వెల్లడించారు.

యువతి కాలిన గాయాలతో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని, యువతికి బద్వేలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అయితే 80 శాతం కాలిన గాయాలతో చికిత్సపొందుతూ యువతి చనిపోయిందని అన్నారు. యువతికి ఐదేళ్లుగా విఘ్నేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఉందని తెలిపారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారని, ఆరు నెలల క్రితం మరో యువతిని విఘ్నేష్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్నారు.

పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతోనే తగులబెట్టాడు: ఎస్పీ (ETV Bharat)

"ఇంటర్ విద్యార్థిని కేసు" - నిందితుడికి విధించే శిక్ష వేరొకరికి భయం కలిగించాలన్న సీఎం

గతంలో తెలిసిన యువతితో పరిచయం కొనసాగించాడని, తనను కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని యువతికి తెలిపాడన్నారు. ఇద్దరూ కలిసి ఆటోలో ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారని, యువతి పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందన్నారు. వాగ్వాదం తర్వాత యువతిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టాడని, ఘటనపై మూడు బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని గాలించామన్నారు. కడప శివారులో నిందితుడిని పట్టుకున్నామని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితుడు చేశాడని ఎస్పీ తెలిపారు.

"మాట్లాడుకుందామని యువతిని విఘ్నేష్‌ రమ్మని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఘటన జరిగిన ప్రాంతానికి ఆటోలో వెళ్లారు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తర్వాత యువతిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. మధ్యాహ్నం నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితుడు హత్య చేశాడు. త్వరగా దర్యాప్తు ముగించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తాం". - హర్షవర్ధన్‌ రాజు, కడప ఎస్పీ

బద్వేల్‌లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.