ETV Bharat / state

ప్రజాదరణ కోల్పోయినా డబ్బు సంచులతో అధికారంలోకి వస్తున్నారు: జస్టిస్ ఎన్‌వీ రమణ

Justice NV Ramana Comments: నాలుగేళ్లు ఓ పార్టీలో ఉండి పదవులన్నీ అనుభవించాక చివరిలో మరో పార్టీలోకి కుప్పిగంతులు వేస్తున్న నేతలు ప్రస్తుత రాజకీయాలలో ఉన్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ వైద్యులు డా. కామినేని పట్టాభిరామయ్య వైద్య వృత్తి విరామ అభినందన సత్కార కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు.

justice_nv_ramana_comments
justice_nv_ramana_comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 11:56 AM IST

Updated : Feb 13, 2024, 12:04 PM IST

ప్రజాధరణ కోల్పోయినా డబ్బు సంచులతో అధికారంలోకి వస్తున్నారు: జస్టిస్ ఎన్‌వీ రమణ

Justice NV Ramana Comments: ప్రస్తుతం రాజకీయాలు అత్యంత విచారకరంగా ఉన్నాయని, నాలుగేళ్లు ఓ పార్టీలో ఉండి పదవులన్నీ అనుభవించాక చివరిలో మరో పార్టీలోకి కుప్పిగంతులు వేస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి వారికే ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమన్నారు.

విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డా. కామినేని పట్టాభిరామయ్య (Kamineni Pattabhi Ramaiah) 50 ఏళ్ల వైద్య వృత్తి విరామ అభినందన సత్కార కార్యక్రమాన్ని ఆయన మిత్రులు విజయవాడలోని ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడారు. ప్రస్తుతం విలువలు కలిగిన రాజకీయాలకు నేతలు చెల్లుచీటీ చెప్పి, కుప్పిగంతుల రాజకీయాలకు తెరలేపారన్నారు.

ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలు నడుపుతున్నారు.. రాజకీయాలపై జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం

నాలుగేళ్ల 11 నెలల రెండు రోజులు ఓ పార్టీలో అధికారం అనుభవించి, ఎన్నికల ముందు మరో పార్టీలోకి మారుతున్నారని పేర్కొన్నారు. ప్రజాదరణ కోల్పోయినా డబ్బు సంచులతో తిరిగి అధికారంలోకి వస్తున్నారన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి నేతలదే పైచేయి అవుతోందని తెలిపారు. ఫిరాయింపుల చట్టం పూర్తిగా నిర్వీర్యమైందని, ఇలాంటి వారిని నియంత్రించాలంటే ప్రజలే ముందుకు రావాలని కోరారు. ఇకముందు ఇంకా ఎలాంటి పెడధోరణిలు చూడాల్సి వస్తుందోననే భయం కలుగుతోందని జస్టిస్‌ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.

క్రమశిక్షణ, నైతిక విలువలతో జీవితం కొనసాగించిన పట్టాభిరామయ్య లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి ఏమైనా చేయాలని ఎన్‌.వి.రమణ విజ్ఞప్తి చేశారు. ఆయన ద్వారా తాను చాలా అంశాల్లో ప్రభావితం అయ్యానని, తాను ఈ స్థాయికి రావడం వెనుక పట్టాభిరామయ్య పాత్ర ఎంతో ఉందని వెల్లడించారు. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి జడ్జి అయ్యేవరకూ గార్డియన్‌గా ఆయనే ఉన్నారని తెలిపారు.

EX CJI Justice NV Ramana: మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ సేవలకు అమెరికాలో ప్రశంస..

ఒకప్పుడు ఈ ప్రాంతంలో విజ్ఞాన వాతావరణం ఉండేదని, ప్రస్తుతం కుల, మత తత్వాలు కొందరిని ఆవహించాయని లోక్​సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (Jaya Prakash Narayana) ఆందోళన వ్యక్తం చేశారు. నేడు మంచి కన్నా చెడే వేగంగా పరుగులు పెడుతోందన్నారు. స్థిత ప్రజ్ఞత కల్గిన పట్టాభిరామయ్య లాంటి వారి స్ఫూర్తిని యువ వైద్యులు తీసుకుని సమాజానికి సేవ చేయాలని సూచించారు.

నిబద్ధత, నిజాయతీ కలిగిన పరిపూర్ణుడు పట్టాభి రామయ్య అని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) కొనియాడారు. తన వైద్య వృత్తి విరమణ ఎవరికీ చెప్పకుండా తానే తీసుకున్న నిర్ణయమని డా.పట్టాభిరామయ్య అన్నారు. చేసే పని ఏదైనా నిక్కచ్చిగా, నిబద్ధతతో చేయాలన్నారు. గతంలో ఒకసారి ఎన్‌.వి.రమణ ఎన్నికల్లో పోటీ చేస్తానని నాతో అంటే ఇప్పుడే వద్దన్నానని తెలిపారు. ఆ రోజు సీటు రాకపోవడంతో రాజకీయ నాయకుడు కాలేదని కానీ మంచి న్యాయమూర్తిగా పేరు సాధించడం ఆనందంగా ఉందని పట్టాభిరామయ్య పేర్కొన్నారు.

Last Updated : Feb 13, 2024, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.