Delay in Jurala Project Crust Gates Repair Works : ఉమ్మడి పాలమూరు జిల్లాకు జూరాల ప్రాజెక్టు జలప్రదాయిని. జలాశయం నిర్మాణం పూర్తై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా క్రస్ట్ గేట్ల మరమ్మతు చేపట్టారు. అప్పట్లో ప్రభుత్వ నిధులు సకాలంలో విడుదలకాక పనులు ఆలస్యమయ్యాయి. ప్రారంభమైన పనుల్లోనూ తరచూ ఏదో ఆటంకం కలుగుతోంది. మొత్తం జారాలకు 62 గేట్లు ఉండగా, రెండేళ్ల నుంచి ఇప్పటి వరకూ నాలుగైదు గేట్ల మరమ్మతులు మాత్రమే పూర్తి చేశారు.
Jurala Project in Gadwal District : క్రస్ట్ గేట్లకు ఎగువన ఉండే మోటార్లకు ఇతర ఛానల్స్‌కు పెయింటింగ్ పనులు మాత్రం పూర్తయ్యాయి. మరోవైపు చాలాకాలంగా గేట్లు వాడుతుండటంతో అవి బరువు తగ్గిపోతాయి. దీంతో వాటిని బరువు పెంచి బలోపేతం చేయాలి, అలాగే లీకేజీలు ఉన్నచోట మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే నీరు బయటకు రాకుండా రబ్బరు సీల్స్ వేయాలి. ఈ పనులన్నీ ఆగకుండా సాగితే రెండు మూడు నెలల్లో పూర్తవుతాయి. కానీ రెండేళ్లుగా పనులు నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. గ్యాంట్రీ క్రేన్ తరచూ పాడవడమే పనుల జాప్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
"గేట్ల మరమ్మతు పనులు రెండు సంవత్సరాలుగా నడుస్తున్నాయి. గేట్ల బరువుకు తగ్గిపోయాయి. వాటిని బరువు పెంచే పనులు చేస్తున్నాం. ఇప్పటివరకూ నాలుగేట్ల పనులు పూర్తయ్యాయి. గ్యాంట్రీ క్రేన్ తరచూ పాడవడమే పనుల జాప్యానికి కారణం అవుతోంది. క్రేన్‌ను కూడా రిపేర్ చేశాం. ఈ సంవత్సరంలోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించాం." - జుబేర్ అహ్మద్, ఈఈ
Jurala Project Works in Gadwal : వానాకాలంలోనే జూరాల మరమ్మతులు పూర్తి.. కానీ?
జూరాల నీటి నిల్వ సామర్థ్యం తొమ్మిదిన్నర టీఎంసీలు. వరదలు వచ్చినప్పుడు లీకేజీ ద్వారా నీరు బయటకు వెళ్లి, నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ఏళ్లుగా జూరాల పూడిక తీయలేదు. దీంతో నీటి నిల్వ గణనీయంగా తగ్గిపోయింది. వరదలొచ్చినప్పుడు నీరు నిల్వ లేకుండా దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ వేసవిలో జలాశయం డెడ్ స్టోరేజీకి చేరే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, గేట్ల మరమ్మతు, పూడిక తీత పనులు పూర్తి చేయాలని నడిగడ్డ వాసులు కోరుతున్నారు.
"రెండు దశాబ్దాల తర్వాత ప్రభుత్వం జూరాల ప్రాజెక్టుకు నిధులు కేటాయించింది. అయినా గేట్ల మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు, తాగు నీరు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ప్రాజెక్టులో పూడిక తీయని కారణంగా నీటి నిల్వ సామర్థం తగ్గిపోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరతిగతిన పనులు చేయాలని కోరుతున్నాం." - రైతులు
వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలి : నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల కాలంలో పనులు జరగలేదు. మరో రెండు నెలలు గడిస్తే, వర్షాల వల్ల ప్రాజెక్టుకు వరద వస్తుందని, ఆ తర్వాత మరమ్మతులు చేయడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. జూరాల కింద యాసంగిలో పంట విరామం ప్రకటించారని, ఇప్పుడే పూర్తి చేయలేని పరిస్థితి ఉంటే మిగతా సమయంలో ఎలా సాధ్యమని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.
Ramanpadu Project Problems : దయనీయంగా రామన్‌పాడు ప్రాజెక్టు.. పిచ్చిమొక్కలతో ప్రశ్నార్థకంగా భద్రత