Journalists Protest Against Attack on ABN Photographer Krishna in Rapthadu : రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ సాక్షిగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడిని ఖండిస్తూ, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో APUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ అరాచక మూకల దాడికి నిరసనగా పట్టణంలోని BSR సెంటర్లో మానవహారం చేపట్టి నిరసన ర్యాలీ చేపట్టారు. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయన్నారు. MLA కొడాలి నాని జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను APUWJ సంఘ నేతలు తీవ్రంగా ఖండించారు.
సిద్ధం సభలో ఏబీఎన్ ఫోటోగ్రాఫర్పై దాడి హేయం : టీడీపీ
Journalists Protest Against Attack on ABN Photographer : N.T.R జిల్లా నందిగామలో R.D.O కార్యాలయం వద్ద పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో దివి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో A.P.U.W.J ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంబేడ్కర్ భవన్ ఎదుట బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం దారుణమని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ధ్వజమెత్తారు. దాడులు పాల్పడిన వారిపై 307 కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్లిన అనిల్ కుమార్ యాదవ్‌ని అక్కడి ప్రజలు ఓడించి మళ్లీ నెల్లూరుకు పంపిస్తారని ఎద్దేవా చేశారు.
మీడియా ప్రతినిధులపై దాడి చేయడం వైసీపీ రౌడీ మూకల దుర్మార్గం: అచ్చెన్నాయుడు
Journalists Protest in Andhra Pradesh : ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అనంతపురం జిల్లాలో విలేకరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమం లో ఏపీడబ్లూజేఏ (APWJA) ప్రెసిడెంట్ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొన్ని మీడియా సంస్థల మీద మీడియా విలేకరుల మీద కక్ష సాధింపు ధోరణి గా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని రానున్న ఎలక్షన్లలో ఇటువంటి దాడులు మరీ ఎక్కువ అవుతాయని వీటన్నిటిని కూడా మనమందరము సమష్టిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ గురువారం చలో అనంతపురం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీడియా మిత్రులు పత్రికా విలేకరుల పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు