Jewellery Shop Robbery in Malakpet : రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పట్టపగలు జరుగుతున్న వరుస దొంగతనాలు నగరంలో కలకలం రేపుతున్నాయి. నిన్నకాక మొన్న అమీన్పూర్లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయిన ఘటన మరువక ముందే, తాజాగా చాదర్‌ఘాట్ ఠాణా పరిధి అక్బర్ బాగ్‌లోని కిస్వా బంగారు ఆభరణాల(Gold Jewellery) దుకాణంలో చోరి చోటుచేసుకుంది. పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బంగారం దుకాణంలో దోపిడీ సంఘటన పోలీసులను ఉరుకులు పరుగలు పెట్టించింది.
ద్విచక్ర వాహనంలో(Two Wheeler Vehicle) వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు నగల దుకాణంలోకి చొరబడి, షాపు యాజమాని కొడుకుపై కత్తులతో దాడి చేసి అందినకాడికి బంగారాన్ని దోచుకున్నారు. ఆగంతకులు ఒక్కసారిగా దాడి చేయడంతో అతని మెడ, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. సంచిలో దాదాపు రూ.20 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు తీసుకుని ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. బాధితుడి అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
రెచ్చిపోయిన దొంగలు- కస్టమర్స్‌లా జువెల్లరీ షాప్‌లోకి చొరబడి యజమానిపై దాడి!
"మధ్యాహ్న సమయంలో కస్టమర్లా ఓ వ్యక్తి మాస్కు పెట్టుకొని షాప్‌కు వచ్చాడు. అప్పుడు దుకాణంలో మా మేనల్లుడే ఉన్నాడు. సిల్వర్ గొలుసు అడగటంతో తీసి ఇచ్చేలోగా మరో వ్యక్తి వచ్చి కౌంటర్‌పై ఎక్కటంతో, మా మేనల్లుడు అతడిని నెట్టేశాడు. కిందిపడిన ఆ వ్యక్తి వెంటనే లేచి నైఫ్‌తో అటాక్ చేశాడు. వెంటనే మరో వ్యక్తి బ్యాగ్ తీసుకు వచ్చి షాపులో ఉన్న బంగారాన్ని దోచుకుపోయారు. కొద్దిపాటి క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. దుండగులెవరో గుర్తించలేదు కానీ షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయి. అందులో పరిశీలించవచ్చు."-బాధితుని బంధువు
Attack on Jewellery Shop Owner : సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, క్లూస్ టీమ్, సీసీ కెమెరాల్లో(CC Cameras) నిక్షిప్తమైన దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈస్ట్ జోన్ డీసీపీ జానకీ ధరావత్ చోరీ జరిగిన దుకాణం వద్దకు వచ్చి వివరాలను సేకరించారు. దుకాణంలో ఎంత బంగారం దొంగతనానికి గురయిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
Robbery in Gold Shop : దోపిడీ దొంగలను పట్టుకోవడానికి పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పక్కా పథకం ప్రకారం ఆగంతకులు దోపిడీ చేశారని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీలోని దృశ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఎవరి మీదైనా అనుమానం ఉందా అని దుకాణం యజమానిని ప్రశ్నించిన పోలీసులు, త్వరలోనే దోపిడీకి పాల్పడిన ఆగంతకులను పట్టుకుంటామని చెబుతున్నారు.
డబ్బుకోసం ఏకంగా బ్యాంకుకే కన్నం వేసిన దొంగ - అలారం మోగడంతో విఫలం
'సీఎం, మాజీ సీఎం, టీవీ ఛానల్స్ వస్తేనే బయటికొస్తా - లేదంటే మీరు నన్ను కొడతారు'