ETV Bharat / state

జయహో ఆంధ్రమాత సాహో నీదుచరిత - చారిత్రక సమయంలో చరిత్రాత్మక గీతం ఏపీ ప్రజలకు అంకితం - Jayaho Andhra Matha Song - JAYAHO ANDHRA MATHA SONG

Jayaho Andhra Matha Song Video : ఏపీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితమిస్తూ జయహో ఆంధ్రమాత సాహో నీదుచరిత అనే గీతం విడుదలైంది. గుండెను హత్తుకునే సాహిత్యం కలిగిన ఈ పాటను ఓసారి మీరూ వినండి.

Jayaho Andhra Matha Song
Jayaho Andhra Matha Song (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 11:07 AM IST

Updated : Jun 12, 2024, 2:02 PM IST

Jayaho Andhra Matha Song Video Viral : ఆంధ్రప్రదేశ్​లో ఇవాళ చారిత్రకఘట్టం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలోని సభా ప్రాంగణంలో ఆయన చేత గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానుల కోలాహాలం నడుమ ఆద్యంతం సండిగా సాగింది.

Chandrababu Oath Ceremony As AP CM : ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, రామ్మోహన్‌నాయుడు, చిరాగ్‌ పాసవాన్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్‌ దంపతులు, రామ్‌చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమయంలో మరో చారిత్రక సంఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కొన్ని క్షణాల ముందు ఆంధ్రప్రదేశ్ గతవైభవాన్ని స్మరించుకుంటూ ఉజ్వలమైన భవిష్యత్‌ను ఆకాంక్షిస్తూ "జయహో ఆంధ్రమాత - సాహో నీదుచరిత" అంటూ సాగిన పాట విడుదలైంది. సినీ గేయరచిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీత దర్శకుడు హరిగౌర మ్యూజిక్ అందించారు. సినీ నిర్మాత భరత్ చౌదరి ఈ పాట నిర్మాత బాధ్యతలు తీసుకున్నారు. ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

'మమ్ముగన మా జనని ఆంధ్రావని మమకార సాకార సంధాయని మహనీయ సౌశీల్య జనజీవని ముమ్మూర్తుల నువ్వు సంజీవని' అంటూ సాగే పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు పలు రకాలుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట చాలా బాగుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి లిరిక్స్, విజువల్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇందులోని సాహిత్యంలో ఎన్నో విషయాలు గుర్తుకు తెచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మూడు రాజధానుల ఆట ముగిసింది - ఇక నుంచి ఏపీ క్యాపిటల్ అమరావతి : చంద్రబాబు - AP CM CHANDRABABU OATH CEREMONY

Last Updated : Jun 12, 2024, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.