ETV Bharat / state

జానీ మాస్టర్​కు మరో షాక్​ - జాతీయ పురస్కారం తాత్కాలిక నిలిపివేత - jani master national award revoked - JANI MASTER NATIONAL AWARD REVOKED

ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​కు​ జాతీయ అవార్డు తాత్కాలిక నిలిపివేత. ఆహ్వాన పత్రిక రద్దు

Jani Master National Award
Jani Master National Award (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2024, 6:32 AM IST

Updated : Oct 6, 2024, 3:15 PM IST

Jani Master National Award : ప్రముఖ కొరియోగ్రాఫర్​ షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీమాస్టర్‌కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్​ ఫిల్మ్​ అవార్డు సెల్​ శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అవార్డు నిలిపివేస్తున్నట్లు ఆ సెల్​ పేర్కొంది. 2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్​ ఎంపికయ్యారు. ఈనెల 8న దిల్లీలోని విజ్ఞాన్​భవన్​లో పురస్కారం పొందేందుకు జానీ మాస్టర్​కు ఆహ్వానం అందింది. అయితే పోక్సో కేసు నేపథ్యంలో అవార్డు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో నేషనల్​ ఫిల్మ్​ అవార్డు సెల్​ వెల్లడించింది.

అయితే తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ సహాయ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​పై ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేయడంతో అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. దీంతో జానీ మాస్టర్​పై​ అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, అలాగే ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు సెల్​ పేర్కొంది. కాగా దిల్లీలో జరిగే అవార్డు ఫంక్షన్​ కోసం జానీ మాస్టర్​ మధ్యంతర బెయిల్​ పొందారు. ఇందుకు ఆయనకు న్యాయస్థానం ఈనెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్​ను ఇచ్చింది.

అసలేం జరిగింది : గత సెప్టెంబరు 16న ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​పై అతని వద్ద పని చేసే అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​ లైంగిక వేధింపుల కేసును పెట్టారు. ఈ వేధింపులు 2019 నుంచి ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. 2017లో జానీ మాస్టర్​ పరిచయం అయ్యారని 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరి అదే ఏడాది ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం అక్కడికి వెళ్లామని తెలిపింది.

అక్కడ హోటల్​ గదిలో తనపై జానీ మాస్టర్​ అత్యాచారం చేశారని వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే మరి డ్యాన్స్​ చేయవని బెదిరించినట్లు, నినిమా పరిశ్రమలో ఇక ఎప్పటికీ పని చేయలేవని లొంగ దీసుకున్నట్లు కేసులో తెలిపింది. దీన్నే అవకాశంగా తీసుకుని హైదరాబాద్​లో కూడా పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ ఫిర్యాదు చేయగా ఆ కేసు నార్సింగికి బదిలీ చేశారు.

మధ్యంతర బెయిల్ : తను మైనర్​గా ఉన్నప్పుడే జానీ మాస్టర్​ తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు చెప్పడంతో అతనిపై పోక్సో యాక్టు కింద కేసును నమోదు చేశారు. జానీ మాస్టర్​ కోసం గాలించిన పోలీసులకు గోవాలో అతను పట్టుబడ్డాడు. తర్వాత అతనిని కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జ్యూడీషియల్​ రిమాండ్​కు తరలించారు. ఆ తర్వాత పోలీసు కస్టడీకి 4 రోజులు కోర్టు అనుమతించింది. ఆ తర్వాత కోర్టు జానీ మాస్టర్​కు నేషనల్​ అవార్డు అందుకునేందుకు మధ్యంతర బెయిల్​ ఇచ్చింది. ఇప్పుడు జానీ మాస్టర్​కు నేషనల్​ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అవార్డుల సెల్​ ప్రకటన విడుదల చేసింది.

జానీ మాస్టర్​కు మధ్యంతర బెయిల్ మంజూరు - కారణం ఇదే ​ - Interim Bail For Jani Master

తప్పును అంగీకరించిన జానీ మాస్టర్ - రిమాండ్​ రిపోర్ట్​లో కీలక విషయాలు - Jani Master Rape Case Update

Last Updated : Oct 6, 2024, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.