ETV Bharat / state

జనసేన పార్టీ గుర్తు కేటాయింపుపై విచారణ- పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలన్న హైకోేర్టు

Janasena Party Glass Symbol Issue in High Court: జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. తమ నిర్ణయంలో నిబంధనల ఉల్లంఘన ఏమీ జరగలేదన్నారు. గాజు గ్లాస్ గుర్తును జనసేనకు సీఈసీ కేటాయించడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది.

Janasena Party Glass Symbol Issue in High Court

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 9:33 AM IST

Janasena Party Glass Symbol Issue in High Court: జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు కేటాయింపు కోసం ముందుగా దరఖాస్తు చేసుకుందని, చట్ట నిబంధనలకు అనుగుణంగా గాజు గ్లాసు గుర్తును కేటాయించామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. మొదట వచ్చిన వారికి మొదట విధానంలో పార్టీ గుర్తు కేటాయించామని ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ కోర్టుకు తెలిపారు. తమ నిర్ణయంలో నిబంధనల ఉల్లంఘన ఏమీ జరగలేదన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. జయసూర్య ఈ విషయంపై స్పందిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలన్నారు. పార్టీ గుర్తుల కేటాయింపు కోసం జనసేన పార్టీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (సెక్యూలర్‌) పార్టీ చేసుకున్న దరఖాస్తులను కౌంటర్‌తో జత చేయాలని స్పష్టం చేశారు. విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు.

కలిసికట్టుగా పని చేద్దాం - టీడీపీ-జనసేనను గెలిపిద్దాం: నాగబాబు

Central Election Commission Reported to High Court: తమ దరఖాస్తును పట్టించుకోకుండా జనసేన పార్టీకి గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌(సెక్యూలర్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజమహేంద్రవరానికి చెందిన ఎం. శ్రీనివాస్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎంవీ రాజారామ్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల గుర్తులు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ గుర్తు కోసం గత సంవత్సరం డిసెంబర్‌ 20వ తేదిన చేసిన దరఖాస్తును ఈసీ పట్టించుకోలేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించిందన్నారు. ఈసీ ఉత్తర్వులపై స్టే విధించి, గాజు గ్లాసును ప్రచారానికి వినియోగించుకోకుండా జనసేనను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు.

పథకాలు ఎట్టి పరిస్థితిల్లో ఆగవు - ఎంత ఉదారంగా ఇవ్వగలమో చూపిస్తాం: పవన్‌

High Court Order to Counter With Complete Details: ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. పిటిషన్​లో పేర్కొన్న రెండు పార్టీలు అన్‌ రికగ్నైజ్డ్‌ రిజిస్ట్రర్‌ పార్టీలన్నారు. ఇలాంటి పార్టీలు అసెంబ్లీ కాలపరిమితి ముగియడానికి అరు నెలల ముందు ఫ్రీ సింబల్‌ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో గత డిసెంబర్‌ 12న తాము దరఖాస్తుల ఆహ్వానాన్ని ప్రారంభించగా అదే రోజు జనసేన పార్టీ దరఖాస్తు చేసిందన్నారు. మొదట వచ్చిన వారికి మొదటి విధానంలో భాగంగా గాజు గ్లాసు గుర్తును కేటాయించామన్నారు. పిటిషనర్‌ పార్టీ(రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌) డిసెంబర్‌ 20న దరఖాస్తు చేయగా అది 26న తమకు అందిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ఆదేశించారు.

పార్టీ విరాళాల చెక్కులు వెనక్కి పంపిన జనసేనాని - ఎందుకలా చేయాల్సి వచ్చింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.