Janasena Murthy Yadav on AP CS Jawahar Reddy: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తన కుమారుడు బినామీలతో 800 ఎకరాలు కాజేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. తాను చెప్తున్న అంశాలకు తగిన ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు బహిర్గతం చేసారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రోద్బలంతో విశాఖ, విజయనగరం కలెక్టర్లు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చేశారని, ఫలితంగా పేద రైతుల అసైన్డ్ భూములు లాగేసుకున్నారని దీనిపై సీబీఐ లేదా సెట్టింగ్ జడ్జితో పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తన కుమారుడిని ముందే పంపి, అగ్రిమెంట్లు చేసుకుని, ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ముందే ఇచ్చారని ఆరోపించారు. భోగాపురం సమీపంలోని కంచెరు గ్రామంలో అనుమతులు ఇస్తూ విజయనగరం ప్రస్తుత కలెక్టర్ నాగ లక్ష్మీ ప్రొసీడింగ్స్ ఇచ్చారని అన్నారు. అదే విధంగా పూసపాటి రేగ మండలంలో ఎరుకొండ గ్రామంలో, చిన్న బత్తిలి వలస, కోవాడా, పొన్నాడ గ్రామాల్లో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారని తెలిపారు.
విశాఖ భీమిలి మండలం పద్మనాభంలోనూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారన్న మూర్తి యాదవ్, ఐనాడ, బుద్ధివలస, కొరడామద్ది, నరసాపురం, పాండ్రంగి, తిమ్మాపురం గ్రామాల్లో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చినట్టు చెప్పారు. ఇక ఆనందపురంలో 700 ఎకరాలలో ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారని ఆరోపించారు. బాకులపాడు, చందక, గండిగుండం గిడిజాల, బొట్టుపల్లి, పందలపాక గ్రామాల్లో ఉన్న భూములకు సర్టిఫికెట్స్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు భూమి రైతుల పేరు మీద ఉందో లేదో సీఎస్ జవహర్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. నా ఎస్సీ, ఎస్టీలు అనే ప్రభుత్వం ఇదేనా అని ప్రశ్నించిన మూర్తియాదవ్, బలహీనవర్గాల రైతులకు చేసే న్యాయం ఇదేనా అంటూ మండిపడ్డారు. మొత్తం వైఎస్సార్సీపీ నాయకులు విశాఖ, విజయనగర జిల్లాలో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ తీసుకుని ఉత్తరాంధ్రను దోచేశారని విమర్శించారు. నిజంగా సీఎస్ జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
జవహర్ రెడ్డి చీప్ సెక్రటరీ - ఏపీ సీఎస్‌పై సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు - TDP Somireddy Comments on CS
జీవో 596 వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల మీద విచారణ చేయాలని కోరారు. సీఎం జగన్ సతీమణి భారతి పేరు చెప్పి ఈ లావాదేవీలు వేగంగా జరిగేలా చేశారని, రైతుల చేతిలో ఈ భూములు లేవని త్వరలో దీని వెనక ఉన్న ఎమ్మార్వో పేర్లు బయట పెడతానని మూర్తి యాదవ్ తెలిపారు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుతం రాదని తెలిసి, రహస్యంగా ఈ భూ లావాదేవీలను సీఎస్ జవహర్ రెడ్డి జరిపారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే భోగాపురం మీదే సీఎస్‌కు ప్రేమ ఎందుకని ప్రశ్నించారు.
సీఎస్ నియంత్రణలో ఈసీ? - అధికార పార్టీకి కలిసొచ్చేలా జవహర్‌రెడ్డి నిర్ణయాలు! - Criticism that EC