Pawan key comments on YS Jagan assets: కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వివిధ కులాలు కొట్టుకు చావాలనేదే జగన్ నైజం అని పవన్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలిపేవారినే జనం గుర్తు పెట్టుకుంటారు, విడదీసే వారిని కాదని పవన్ ఎద్దేవా చేశారు. సమాజానికి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుందని, జగన్ విష సంస్కృతి తిరిగి ఆయన ఇంటికే వచ్చిందని విర్శించారు.
ఆస్తుల పంపకాల్లో వైఎస్ షర్మిలకు అన్యాయం: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చాలా కష్టపడి వేల కోట్లు సంపాదించి ఇద్దరు బిడ్డలకు సమానంగా ఇచ్చారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అందులో జగన్ తన స్వంత చెల్లికే వాటా ఇవ్వలేదని, ఇది చాలా బాధ కలిగించే అంశం అని వెల్లడించారు. సాక్షి పేపర్, భారతి సిమెంట్‌లో వాటాలు ఇవ్వలేదు. సొంత చెల్లికే ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం చేస్తారని పవన్ కల్యాణ్ విమర్శించారు. డబ్బుతో ఓట్లు కొనని రాజకీయాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అతడి డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసి అరెస్ట్ ఆయ్యాడని, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అన్నారని విర్శించారు. సమాజాన్ని కలిపేవారిని జనం గుర్తు పెట్టుకుంటారని, ప్రాణత్యాగం చేయడం వల్లే పొట్టి శ్రీరాములును ఇంకా గుర్తు పెట్టుకుంటున్నామని తెలిపారు. దళిత కులాల నుంచి దామోదరం సంజీవయ్య వంటివారు రావాలని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి ప్రవర్తన వల్లే బాలయోగిని అందరూ గౌరవిస్తారని పేర్కొన్నారు.
ఐక్యంగా ముందుకెళ్లాలి - అభిమానాన్ని ఓట్లుగా మార్చండి: పవన్‌కల్యాణ్
అందుకే ఓట్లు చీలకూడదని పిలుపు: ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు కొనసాగించాల్సిందేనని జగన్ అన్నారని, అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం ఎందుకని పవన్ ప్రశ్నించారు. తెలుగుదేశం- జనసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామని తెలిపారు. మీరు సిద్ధం అంటే మేం యుద్ధం అంటామని పవన్ వెల్లడించారు. తనను ఎక్కడైనా ఆపాలని చూస్తే మాట్లాడను, చేతల్లో చూపిస్తా అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మనకు ధైర్యం ఉంది పోరాటం చేస్తామని, కానీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం మనకు తెలియలేదని పవన్ పేర్కొన్నారు. అందుకే ఈసారి ఓట్లు చీలకూడదని పిలుపునిచ్చామన్నారు. ఎవరికైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటానని పవన్ తెలిపారు. అందుకే రెండుచోట్ల ఓడిపోయినా పార్టీ నడుపుతున్నానని పేర్కొన్నారు. సినిమా డైలాగులు నిజజీవితంలో పనికిరావని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎన్నో మాటలు పడ్డానని పవన్ తెలిపారు.
LIVE: భీమవరం నియోజకవర్గ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం - ప్రత్యక్ష ప్రసారం