ETV Bharat / state

ప్రమాణస్వీకారం తర్వాత రామోజీని కలుద్దామనుకున్నా - ఇంతలోనే ఇలా : పవన్‌ కల్యాణ్‌ ఎమోషనల్ - Pawan Kalyan Tribute to Ramoji Rao

Pawan Kalyan Condolence To Ramoji Rao : రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 5:46 PM IST

Updated : Jun 8, 2024, 8:02 PM IST

Pawan Kalyan Condolence To Ramoji Rao
Pawan Kalyan Condolence To Ramoji Rao (ETV Bharat)

Pawan Kalyan Condolence To Ramoji Rao : పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వచ్చి రామోజీ రావును కలుద్దామనుకున్నానని, ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్​ సిటీలో ఉంచిన రామోజీరావు పార్థివదేహానికి పవన్‌ నివాళులు అర్పించారు. ఆయన వెంట వచ్చిన టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) కూడా రామోజీకి అంజలి ఘటించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్‌ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. ఎంతో మంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు ఆయన అని కొనియాడారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వారికి రామోజీ రావు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.

"రామోజీ రావు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారు. అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిల్మ్‌సిటీని నిర్మించారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి. ఈనాడు గ్రూప్​ సంస్థ వారికి నా తరఫున, జనసేన తరఫున సంతాపం తెలియజేస్తున్నాను" - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

గత ప్రభుత్వాలు రామోజీరావును ఎంత ఇబ్బందులు పెట్టినా తట్టుకొని ప్రజలకు చైతన్యం కల్పించి అండగా నిలబడ్డారని పవన్​ కల్యాణ్​ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన ఆయనను గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలు ఇవాళ లేవని, అలాంటి విజయం ఆయనకు తెలియజేయాలని అనుకున్నామని తెలిపారు. కానీ ఈలోపు ఇలా జరగడం చాలా దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాణస్వీకారం తర్వాత వచ్చి కలుద్దామనుకున్నా - ఇంతలోనే ఇలా : పవన్‌ కల్యాణ్‌ ఎమోషనల్ (ETV Bharat)

Chiranjeevi About Ramoji Rao : మరోవైపు రామోజీ పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామోజీరావు ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపంలో పెట్టేవారని, ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఆయన చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదని కొనియాడారు. రామోజీరావు మృతి ఆయన కుటుంబానికే కాదని, తెలుగు జాతికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహావ్యక్తిని, శక్తిని కోల్పోయామని వ్యాఖ్యానించారు.

మా లాంటి ఎంతో మంది నటులను పరిచయం చేశారు - రామోజీకి సినీ హీరోల నివాళులు - TELUGU ACTORS TRIBUTE TO RAMOJI RAO

జీవితంలో ఒక్కరోజైనా ఆయనలా బతకాలి - రామోజీకి టాలీవుడ్ సంగీత ప్రపంచం ఘననివాళి - TOLLYWOOD MUSIC INDUSTRY TRIBUTE TO RAMOJI RAO

Last Updated : Jun 8, 2024, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.