ETV Bharat / state

ప్రేమ పేరుతో యువతి కుటుంబంపై దాడి - ప్రతిఘటనలో ప్రేమోన్మాది మృతి - Lover Attack with Knife

Jagtial Love Harassment Man Murder : ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు, పెళ్లి చేసుకోవాలంటూ యువతి ఇంటికి వెళ్లి మరీ యువతి, ఆమె కుటుంబసభ్యులపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటనలో వారు సైతం మహేశ్​పై బండరాయితో దాడి చేయడంతో అతడు​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చోటుచేసుకుంది.

Jagtial Crime News
Jagtial Love Harassment Man Murder
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 2:14 PM IST

Jagtial Love Harassment Man Murder : ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు, పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధిస్తూ ఆమెపై కత్తితో దాడికి(Attack with a knife) యత్నించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడి చివరికి వారి చేతిలోనే హతమయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

మల్యాల సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ దామోదర్‌రెడ్డి, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, తక్కళ్లపల్లికి చెందిన రాజేశం జీవనోపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు. అతడి భార్య సత్తవ్వ, కుమార్తె(23)తో కలిసి అదే గ్రామంలోని తండ్రి నర్సయ్య వద్ద ఉంటోంది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్‌(26) మూడేళ్లుగా సత్తవ్వ కుమార్తె వెంటపడి పెళ్లిచేసుకోవాలని వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై ఇప్పటికే మల్యాల ఠాణాలో పలుమార్లు బాధితురాలు ఫిర్యాదు చేయగా 2022లో మహేశ్‌పై కేసు నమోదైంది.

Man Attacked Young Woman With Knife in Jagtial : నాలుగు రోజుల కిందట యువతి జగిత్యాలలోని కాలేజీకి వెళ్లే సమయంలో దాడికి యత్నించడంతో మళ్లీ ఫిర్యాదు చేయగా మరోసారి కేసు నమోదు చేశారు. అయినా తీరు మార్చుకోని మహేశ్‌ సోమవారం నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో తీవ్ర దాడికి యత్నించాడు. యువతి తాత, తల్లి అడ్డుకోవడంతో వారిపైనా దాడికి పాల్పడ్డాడు. ప్రతిఘటించే సమయంలో మహేశ్‌ కిందపడగా వారు పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టడంతో మృతిచెందాడు.

మైనర్​ను​ ప్రేమించి పెళ్లాడిన లెక్చరర్​ - నిందితుడిపై పోక్సో​ కేసు నమోదు

Jagtial Crime News : విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం తీవ్రంగా గాయపడ్డ నర్సయ్య, సత్తవ్వలను పోలీసులు జగిత్యాల ఆసుపత్రికి(Govt Hospital) తరలించి చికిత్స అందించారు. యువతి తాత పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహేశ్‌ తండ్రి ఫిర్యాదుతో యువతితోపాటు ఆమె అన్న, తల్లి, తాత, అమ్మమ్మలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అబ్దుల్‌రహీం తెలిపారు.

ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇటువంటి మరో ఘటనే కరీంనగర్​లోనూ జరిగింది. ప్రేమిస్తున్నామంటూ వెంట పడి, అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి ప్రాణాలు సైతం తీసేందుకు కూడా వెనకాడలేదు. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఓ ప్రేమోన్మాది, యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కత్తితో మెడపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకునే ప్రయత్నంలో ఆమె చేయి తెగింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3రోజులుగా ఫ్రెండ్​ మృతదేహంతోనే- గదిలో సెంట్​ కొడుతూ గడిపిన కుటుంబం- భయంతోనేనట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.