ETV Bharat / state

పల్నాడు జిల్లాలో భారీ భూ కుంభకోణం? - శాఖలను తప్పుదోవపట్టించి మాజీ సీఎం జగన్ అడ్డగోలు మేళ్లు! - JAGAN ROLE ON SARASWATI POWER PLANT

సరస్వతీ పవర్‌కు సున్నపురాయి నిల్వలు కేటాయింపుల్లో ఉల్లంఘనలు

JAGAN_ROLE_ON_SARASWATI_POWER_PLANT
JAGAN_ROLE_ON_SARASWATI_POWER_PLANT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 9:20 AM IST

Updated : Oct 27, 2024, 9:33 AM IST

Jagan Role Behind Saraswati Power Plant in Palnadu District : జగన్‌కు చెందిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు పల్నాడు జిల్లాలో వందల ఎకరాల్లో సున్నపురాయి నిల్వలను వైఎస్​ హయాంలో కట్టబెట్టడంలో నిబంధనలకు పాతరేశారు. జగన్ సీఎం అయ్యాక మరింత ముందుకు వెళ్లి సొంత కంపెనీకి మరిన్ని 'మేళ్లు' చేసుకున్నారు. పర్యావరణ శాఖను తప్పుదోవ పట్టించి ఎప్పటికప్పుడు అనుమతులు పునరుద్ధరించుకుంటున్న విషయం అధికారుల పరిశీలనలో బయటపడింది. జగన్ కంపెనీ ఆధీనంలోని భూముల్లో ప్రభుత్వ భూములూ ఉన్నట్టు అధికారుల దృష్టికివచ్చింది. తండ్రి, కుమారుడు ముఖ్యమంత్రులుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి సరస్వతీ పవర్‌కు అడ్డగోలుగా చేసుకున్న 'మేళ్ల'పై లోతైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

తండ్రీకుమారుల అధికార దుర్వినియోగం : వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు చెందిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు పల్నాడు జిల్లాలోని మాచవరం, దాచేపల్లి మండలాల్లో కొన్ని వందల ఎకరాల పరిధిలో విలువైన సున్నపురాయి నిల్వలను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా ధారాదత్తం చేయడంలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు వెల్లడైంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిబంధనలు తుంగలో తొక్కుతూ సొంత కంపెనీకి మరిన్ని 'మేళ్లు' చేసుకున్నారని బయటపడింది. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ తనదేనంటూ తాజాగా జగన్ తన తల్లి విజయలక్ష్మిపై ఎన్​సీఎల్​టీలో (NCLT) కేసు దాఖలు చేయడంతో ఆ కంపెనీకి సున్నపురాతి నిక్షేపాల కేటాయింపు మొదలు ఇప్పటివరకు జరిగిన ఉల్లంఘనలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు - సరస్వతి పవర్‌ భూముల్లో అధికారుల సర్వే

సొంత కంపెనీకి ధారదత్తం : విద్యుదుత్పుత్తి కంపెనీగా ఉన్న సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వ్యాపార తరహాపై బైలాస్‌లో మార్పులు చేయకుండానే అప్పటి జగన్​ ప్రభుత్వం అడ్డగోలుగా గనులు లీజుకు ఇచ్చేసింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుమీద సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని నిర్ణయించిన జగన్ దాని బైలాస్‌లో మార్పులు చేయాలని అనుకున్నారు. 2008 జులై 15న జగన్ అధ్యక్షతన కంపెనీ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కంపెనీ సిమెంట్ వ్యాపారంలో ప్రవేశించేలా బైలాస్‌లో మార్పులు చేస్తూ జగన్ భార్య భారతి తీర్మానం ప్రవేశపెట్టారు. జగన్ తల్లి విజయలక్ష్మి బలపరిచారు. కానీ దానికి నెల ముందే నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2008 జూన్ 12న గనులశాఖ డైరెక్టర్ జారీచేసిన మెమో ఆధారంగా సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు మైనింగ్ లీజు కేటాయించింది. 2009 మే18న జీవో 107 జారీ చేసింది. అంటే కంపెనీ బైలాస్ మార్చకముందే లీజుకు ఆమోదం తెలుపుతూ మైనింగ్ శాఖ మెమో జారీ చేసింది. ఇది చట్టవిరుద్ధం, అధికార దుర్వినియోగమని అధికారులు చెబుతున్నారు.

ఆ కేసుకు ఆరు సంవత్సరాలు - ఇప్పటి వరకు విచారణకు హాజరవ్వని జగన్‌

పర్యావరణశాఖకు తప్పుడు సమాచారం : సరస్వతీ పవర్‌కు తొలుత 2012 మార్చి 29న కొన్ని నిబంధనలకు లోబడి పర్యావరణ అనుమతులు జారీ అయ్యాయి. దాని ప్రకారం ఏడాదికి 0.0368 టీఎంసీల నీళ్లు సరస్వతీ పవర్‌కు కేటాయించాలి. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ నిబంధనను తుంగలో తొక్కుతూ సొంత కంపెనీకి 0.068 టీఎంసీలు కేటాయించేసుకున్నారు. ఇది పర్యావరణశాఖ అనుమతి ఇచ్చిన దాని కంటే రెట్టింపు. 2019 డిసెంబరు 3న జీవో81 జారీచేశారు. తర్వాత 2020 మే 15న (15-05-2020) జీవో16 ద్వారా ఐదేళ్ల నీటి కేటాయింపును జీవిత కాలానికి మార్చేసుకున్నారు.

రాజధాని అమరావతిపై అంతులేని ద్వేషాన్ని ప్రదర్శించిన జగన్ మోహన్​ రెడ్డి తన కంపెనీకి పర్యావరణ అనుమతులు పొందేందుకు మాత్రం అదే అమరావతిని అడ్డుపెట్టుకున్నారు. సరస్వతీ పవర్ 2012లో జారీచేసిన పర్యావరణ అనుమతుల కాల పరిమితి 2018తో ముగుస్తుండటంతో అనుమతులు కొనసాగించాలని కోరుతూ పర్యావరణ మంత్రిత్వశాఖకు 2018 ఫిబ్రవరి 18న దరఖాస్తు చేశారు. రాజధాని అమరావతిలో చేపట్టే ప్రాజెక్టులకు సిమెంట్ అవసరం ఉంటుందని మంత్రికి తెలియజేశారు. అందువల్ల తమ పరిశ్రమకు అనుమతులు కొనసాగించాలని కోరారు.

చెల్లి ప్రేమ ఉత్తదే - సాక్ష్యాలివిగో!

ప్రభుత్వభూమి ఉందన్న విషయాన్ని కోర్టులో దాచిపెట్టి : పర్యావరణ అనుమతుల పునరుధ్ధరణకు చేసుకున్న దరఖాస్తులో కంపెనీపై కోర్టు కేసులేవీ లేవని సరస్వతీ పవర్ తెలిపినట్టు సమాచారం. కానీ సున్నపురాతి గనుల (Limestone mines) లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ఆ సంస్థ వేసిన పిటిషన్ అప్పటికే కోర్టు విచారణలో ఉందని అధికారుల పరిశీలనలో తేలింది. వ్యాజ్యాలేమీ లేవనడం ద్వారా పర్యావరణ మంత్రిత్వశాఖను తప్పుదోవ పట్టించడం వారి దృష్టికి వచ్చింది. సరస్వతీ కంపెనీ భూములపై జీవోలు ఏమైనా జారీ అయ్యాయా? అన్న ప్రశ్నకు ఏమీ లేవని బదులిచ్చింది. 2014 అక్టోబరులో మైనింగ్ లీజు రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 98 అప్పటికే అమల్లో ఉన్న విషయాన్ని తొక్కిపెట్టిందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారంతో పర్యావరణ శాఖ నుంచి 2019 జులై 3న మూడేళ్ల కాల పరిమితితో 2022 మార్చి వరకు అనుమతులు పొందినట్టు పరిశీలనలో వెల్లడైంది.

పర్యావరణ అనుమతి కోసం చేసిన దరఖాస్తులో దాదాపు 25 ఎకరాల ప్రభుత్వభూమి తమ ఆధీనంలో ఉందని సరస్వతీ పవర్ అంగీకరించిందని, కానీ లీజు రద్దును సవాలుచేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా 25 ఎకరాల ప్రభుత్వభూమి ఉందన్న విషయాన్ని దాచిపెట్టి సరస్వతీ పవర్ తరపు న్యాయవాది కోర్టును తప్పుదోవ పట్టించారని అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

వైఎస్సార్​ స్థాపించిన వ్యాపారాలు జగన్ సొంతం కాదు: షర్మిల

వాటికన్నా పెద్ద స్కాం ఇది : ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి 8.86 ఎకరాల్ని ఆక్రమించుకున్నారని ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, ఆయనను అరెస్ట్ చేసింది. సోరెన్ బంధనలకు విరుద్ధంగా తన కుటుంబానికి గనులు కేటా ఎంచుకున్నారని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దుచేయాలని గవర్నర్‌కు ఎన్నికల కమిషన్ సిఫారసు చేసింది. కర్ణాటకలో భూముల కేటాయింపు వ్యవహారంలో సిద్ధరామయ్యపై లోకాయుక్త కేసు నమోదుచేసింది. వాటితో పోలిస్తే సరస్వతీ పవర్‌కు గనుల కేటాయింపు వ్యవహారం చాలా పెద్ద కుంభకోణమని, దీనిపై లోతైన విచారణ జరిపించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎవరి సొమ్ము ఎవరు పంచుకుంటారు? ప్రకృతి సంపద వైఎస్ కుటుంబ ఆస్తా?

Last Updated : Oct 27, 2024, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.