Jagan Photos and YSRCP Colors For Govt Buildings : ఎటు చూసినా, ఎక్కడ పర్యటించినా నీలి పరదాలు సీఎం సారుకు నేస్తాలు అది విధితమే. కానీ ప్రజలకు ఎటు చూసినా వైఎస్సార్సీపీ వర్ణాలే కనిపించాలని జగనన్న చేసిన పని ఎన్నికల కోడ్ వేళ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. సొమ్ము ఒకడిది సోకొకడిది అన్న చందంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన భవనమైనా మన పార్టీ రంగు పెయింటే ఉండాలని బిల్డింగ్లకు నీలి రంగు కొట్టిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్నా నేటికీ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో వైఎస్సార్సీపీ రంగులు దర్శనమిస్తున్నాయి. కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి ట్యాంకులు , ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న పార్టీ రంగులను తొలగించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు.
ముదిరిన వైసీపీ ప్రచార పిచ్చి - కేంద్ర పథకాలకు పార్టీ రంగులు
YSRCP Colors to Water Tank in Kakinada district : ప్రజలకు ప్రభుత్వం తాగునీటి సౌకర్యం కల్పించకపోయినా వ్యాపార సంస్థల సహాకారంతో నిర్మించిన నీటి ట్యాంకులకు మాత్రం పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకుంటుందని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఇప్పుడు ఆ రంగులు తొలగించడం గ్రామీణ పంచాయతీలకు పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి నుంచి హైకోర్టు పలు మార్లు ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసి ప్రజాధనాన్ని వృథా చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చివరకు ప్రార్థన మందిరాలను వదలరా - వైసీపీ రంగుల రాజకీయం ప్రచారం పిచ్చి పీక్
ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి కూడా వైఎస్సార్సీపీ జెండా రంగే అవడంతో ఆ రంగు తొలగించాలన్నా కొత్త రంగు వేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఆరోగ్యశాఖ అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. మొదట్లోనే హైకోర్టు ఆదేశించినా లెక్కచేయకుండా జగన్ చేసినపని ప్రచారపిచ్చి కాక మరేంటి అని ప్రజలు తిట్టుకుంటున్నారు.
ఆ కేంద్రాలకు పార్టీ రంగు తొలగించాం: ప్రభుత్వం
YSRCP Colors Problems : ఇప్పుడు మళ్లీ రంగులు తొలగించాలంటే కొంత సొమ్ము ఖర్చు అవుతుందని ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ కొత్త రంగులకు ఖర్చు చేస్ సొమ్ము ఎవరి జేబు నుంచి లూటీ చేస్తారని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినందున ఇప్పుుడు ఆ రంగుల వల్ల ఇక్కట్లు మరీ ఎక్కువవుతున్నాయి.