ETV Bharat / state

ఏడు భవనాలు, మూడు ఇళ్లు, 12 పడక గదులు- 'నిరుపేద జగన్ నివాసానికి అనుకూలమట' - Jagan Rushikonda Palace - JAGAN RUSHIKONDA PALACE

Jagan Luxurious Residence on Rushikonda: విశాఖలోని రుషికొండపై జగన్‌ రాజకోట రహస్యం బట్టబయలైంది. పేదల ప్రతినిధిగా డప్పు కొట్టుకునే మాజీ సీఎం జగన్‌పెత్తందారీ భవంతులు కట్టేశారు. లక్షా 41 వేలకు పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. ప్యాలెస్‌లను తలదన్నేలా ఉన్న ఆ నిర్మాణాల వెలుపల, లోపల ఉన్న విలాసాలను చూస్తే కళ్లు తిరగాల్సిందే. పేదలకు సెంటు భూమి విదిల్చి ఆయన మాత్రం ప్రజాధనంతో రాజకోట నిర్మించుకున్నారు.

Jagan_Luxurious_Residence_on_Rushikonda
Jagan_Luxurious_Residence_on_Rushikonda (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 7:42 AM IST

Jagan Luxurious Residence on Rushikonda: అణువణువునా పెత్తందారీ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించారు. వాటితో ఊరూరా ప్యాలెస్‌లు నిర్మించుకున్నా సంతృప్తి చెందని జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తిచేసిన ఏకైక ప్రాజెక్టు రుషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్‌లు మరిన్ని కట్టుకోవడం.! రుషికొండపై భవనాల్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండోయ్‌.! ఆ ఆస్తులన్నీ భద్రంగా దాచుకుని వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చుపెట్టేశారు.

ఏడు భవనాలు, మూడు ఇళ్లు, 12 పడక గదులు- 'నిరుపేద జగన్ నివాసానికి అనుకూలమట' (ETV Bharat)

ఏకంగా 452 కోట్ల రూపాయలతో విలాసవంతమైన నివాస, కార్యాలయ భవనాలు ఏడింటిని బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే మూడు ఉన్నాయి. వాటిలో పడక గదులు పన్నెండు! ప్రతీ పడక గదినీ అనుసంధానిస్తూ అత్యంత విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు. ఆ స్నానాల గదుల్ని చూస్తేనే సామాన్యులకు కళ్లు తిరుగుతాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారిపై ఐదేళ్లూ తెగ ప్రేమ నటించిన జగన్‌ వారికి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది సెంటు భూమి.! దానిలో గరిష్ఠంగా 430 చదరపు అడుగుల ఇల్లు కట్టుకోగలరు. కానీ జగన్‌ బాత్రూం వైశాల్యమే 480 చదరపు అడుగులు.! అంటే పేదల ఇళ్లు జగన్‌ బాత్రూం అంత కూడా లేవన్న మాట.!

రుషికొండపై భవనాలకు 452 కోట్ల అంచనా వ్యయంలో ఇప్పటికే 407 కోట్లు ఖర్చు పెట్టేశారు. అవన్నీ సర్వ హంగులు, ఖరీదైన అంతర్గత అలంకరణలతో ఇప్పటికే సిద్ధమైపోయాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్‌ కూడా చాలా వరకు తెచ్చేశారు. మళ్లీ తానే గెలుస్తానని, ముఖ్యమంత్రిగా 30ఏళ్లపాటు తానే ఉంటానని జగన్‌ కన్న కలలన్నీ కల్లలైపోయాయి. కానీ రాజధానిని విశాఖకు మార్చేసి, రుషికొండపై కొలువు తీరాలనుకున్న జగన్‌ కుట్రపూరితంగా భారీ విధ్వంసానికి తెగబడ్డారు.

'21వ శతాబ్దపు నయా చక్రవర్తి'- రుషికొండ రాజమహల్​లో కళ్లుచెదిరే నిర్మాణాలు - jagan bathroom

రుషికొండపై గతంలో పర్యాటకశాఖ నిర్మించిన, చక్కగా, దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని అక్కడ జగన్‌ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. అక్కడ సీఎం కోసం నివాస, కార్యాలయ భవనాల్ని కడుతున్నా అప్పటి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రోజా, అధికారులు మాత్రం అవి రిసార్టులేనని బుకాయిస్తూ వచ్చారు. చివరిగా మరో నాటకానికి తెరతీశారు. వారి కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మితో ఒక కమిటీ వేసి, రుషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించారు.

ఆమె ఆధ్వర్యంలోని కమిటీ విశాఖలో అన్ని భవనాలూ పరిశీలించిందని, చివరకు రుషికొండపై కట్టిన భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని గుర్తించినట్టు పెద్ద డ్రామా పండించారు. వాటిలో కొన్ని మార్పులు చేస్తే సీఎం నివాసానికి, కార్యాలయానికి చక్కగా సరిపోతాయని ఆమెతో చెప్పించారు. అదంతా పెద్ద డ్రామా.! వాటిలో ఏ మార్పులూ చేయక్కర్లేదు. నేరుగా వెళ్లి వాటిలో ఉండొచ్చు. కానీ వైఎస్సార్సీపీ వాళ్లు ఒకటి తలిస్తే ప్రజలొకటి తలిచారు. ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపారు.

రుషికొండపై అత్యంత రహస్యంగా నిర్మాణాలు సాగించిన జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లూ అనుమతి లేకుండా అక్కడికి చీమనూ చొరబడనివ్వలేదు. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందల మంది పోలీసుల్ని మోహరించి అడ్డుకుంది. మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం, మీడియా ప్రతినిధుల్ని తీసుకుని ఆదివారం రుషికొండ భవనాల్ని సందర్శించడంతో మొత్తం రహస్యం బట్టబయలైంది. రూ.400 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి, దర్పం ఉట్టిపడేలా అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఆ భవనాల్ని చూసినవారికి కళ్లు చెదిరిపోయాయి.

అంతెత్తున శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న భవంతులు, భారీ ప్రవేశద్వారాలు, విశాలమైన పడకగదులు, వాటికి ఏ మాత్రం తీసిపోని విధంగా స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాత్‌ టబ్‌లు, కళ్లు మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని కళ్లారా చూడాల్సిందే తప్ప వర్ణించలేం. ఏ వైట్‌హౌస్‌ లోపలికో, బకింగ్‌హాం ప్యాలెస్‌ లోపలికో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. వాటిలో అంతర్గత అలంకరణల కోసం ఏకంగా 13 వందల 12 రకాల వస్తువులు వినియోగించారు. ఇక ఆ భవనాలకు వెలుపల ఖరీదైన పచ్చికతో విశాలమైన లాన్‌లు, సుందరమైన ఉద్యానవనాల్ని తీర్చిదిద్దారు. నివాస భవనాల్లోంచి చూస్తూ కనుచూపు మేరలో విశాలమైన నీలిసముద్రం సోయగాలు కనిపించేలా డిజైన్లు తీర్చిదిద్దారు.

'ఎవరి కోసం ఈ విలాస భవనాలు?'- రుషికొండ రాజమహల్​ను పరిశీలించిన కూటమి నేతలు - MLA GANTA ON RUSHIKONDA Buildings

రుషికొండపై టూరిజం రిసార్టు ముసుగులో జగన్‌ కోసం కుట్రపూరితంగా కట్టిన నివాస, కార్యాలయ భవనాలకు ప్రజాధనాన్ని యథేచ్ఛగా, లెక్కలేనితనంతో ఖర్చుపెట్టేశారు. రుషికొండపై కడుతున్నది రిసార్టేనని వైఎస్సార్సీపీ నాయకులు చివరి వరకు బుకాయించారు. అది పర్యాటకుల కోసం కట్టినదైతే 7 వేల 266 చదరపు మీటర్ల వైశాల్యం గల భారీ కార్యాలయ భవనాలు నిర్మించాల్సిన అవసరమేంటి? కళింగ బ్లాక్‌లోని రెండు భవనాలను కార్యాలయాల కోసమే నిర్మించారు. మొదటి అంతస్తు వరండాలో ఏర్పాటుచేసిన షాండ్లియర్‌ ఖరీదే 2 లక్షలని చెబుతున్నారు. అలాంటివి ఆ ఒక్క వరండాలోనే పది వరకు ఉన్నాయి. భవనం మొత్తంలో చాలానే ఉన్నాయి.

అంతర్గత అలంకరణ వస్తువులు, ఫర్నిచర్‌ కోసమే సుమారు 33 కోట్ల రూపాయలు వెచ్చించారు. రోడ్లు, కాలువలు, పార్కుల అభివృద్ధికి మరో 50 కోట్ల వరకు ఖర్చుచేశారు. ఆరుబయట సుందరమైన ల్యాండ్‌స్కేపింగ్‌ చేశారు. పార్కులో 2-3 రకాల నడకమార్గాలు ఏర్పాటు చేశారు. రుషికొండపై రిసార్టు పేరుతో ప్రభుత్వం ఆడిన డ్రామాలో ఐదారుగురు ఐఏఎస్‌ అధికారులూ కీలకపాత్ర పోషించారు. పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్‌భార్గవ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అయితే ప్రభుత్వం మారి, రుషికొండ వ్యవహారంపై విచారణ జరిపిస్తే తమ మెడకు చుట్టుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రభుత్వం కనుసన్నల్లోనే మొత్తం కథ నడిపించినా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ కేబినెట్‌ అనుమతి తీసుకున్నారు. జగన్‌కు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లి ఇలా ఊరూరా రాజభవనాల్ని తలదన్నే భవంతులున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌ వంటిచోట్ల జగన్‌ నిర్మించుకున్న ప్యాలెస్‌లు డొల్ల కంపెనీల పేరుమీద ఉన్నట్టు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ వద్ద 5 వేల 807 చదరపు గజాల్లో 88 వేల 458 చదరపు అడుగుల భవన నిర్మాణం కోసం 4 డొల్ల కంపెనీలు పుట్టించినట్టు ఈడీనే నిగ్గుతేల్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.