ETV Bharat / state

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు - రొయ్యల వ్యాపారి ఇంట్లోనూ తనిఖీలు

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు - కృష్ణా జిల్లా నాగాయలంకకి చెందిన రొయ్యల వ్యాపారి ఇంట్లో ప్రత్యేక బృందాల తనిఖీలు

IT_RIDES_ON_grandhi_srinivas
IT RIDES ON Grandhi Srinivas (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

IT RIDES ON YSRCP FORMER MLA GRANDHI SRINIVAS : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భీమవరంలోని ఆయన నివాసంతో పాటు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు, కేంద్ర పారిశ్రామిక రక్షణ బృందాల సాయంతో తనిఖీలు చేశారు. లోపలికి ఎవరినీ అనుమతించలేదు లేదు.

IT Raids in Prawns Merchant House: అటు కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి చెన్ను లక్ష్మణరావు స్వగృహం, ఐస్ ఫ్యాక్టరీ, ఇతర సంస్థలపైనా ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏలూరు నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త నూకల రామకృష్ణ ఇంట్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రముఖ రొయ్యల ఎగుమతిదారు, వైఎస్సార్సీపీ నేత గ్రంథి శ్రీనివాస్​తో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే లక్ష్మణ రావు, నూకల రామకృష్ణ నివాసాలపై ఐటీ దాడులు జరిగినట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.