ETV Bharat / state

హైదరాబాద్​ బిర్యానీలో అంట్ల పీచు - చితకబాదిన యాజమాన్యం - CONTAMINATED CHICKEN BIRYANI

బిర్యానీలో ఇనుప పీచు ముక్కలు రావటంతో నిలదీసిన కస్టమర్లు - దాడికి పాల్పడిన హోటల్‌ నిర్వాహకులు

IRON PEACH IN BIRYANI
PIECES OF IRON PEACH IN BIRYANI (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2024, 1:47 PM IST

Hyderabad News Today: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరెన్నిక గన్న హైదరాబాద్​ బిర్యానీ నాణ్యతపై క్రమక్రమంగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హోటళ్ల నిర్వాహకుల నిర్లక్ష్యం, నాసిరకం సరుకుల వినియోగం వల్ల బిర్యానీలో క్వాలిటీ తగ్గుతోంది. హైదరాబాద్​లోని హోటళ్లలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్​లోని పలు రెస్టారెంట్లలో జీహెచ్​ఎంసీ, ఫుడ్​సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో కుళ్లిపోయిన, పాచిపట్టిన మాంసం నిల్వలు దర్శనం ఇచ్చాయి. తాజాగా ఓ హోటల్​ బిర్యానిలో ఇనుప పీచు ముక్కలు దర్శనమివ్వడంతో నిలదీసిన కస్టమర్లపై హోటల్‌ యాజమాన్యం దాడికి పాల్పడింది.

ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్క్​కి చెందిన బేగరి శంకర్, మహేంద్, నాగరాజు, సురేశ్, మరో ఇద్దరితో కలిసి ఆదివారం మధ్యాహ్నం పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలోని ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు బిర్యాని ఆర్డర్‌ ఇచ్చారు. అయితే ఆ బిర్యానీలో బాసన్లు తోమే సబ్బుకు ఉపయోగించే ఇనుప పీచు ముక్కలు రావడాన్ని గుర్తించిన కస్టమర్లు నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. దానికి బదులుగా వేరే అన్నం ఇస్తామని చెప్పి అప్పటికీ సరైన ఆహారం ఇవ్వకపోవటంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. దీంతో హోటల్‌ నిర్వాహకులు కస్టమర్లపై దాడిచేశారు. ఈ దాడిలో నలుగురు గాయుడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వైన్​షాపు దగ్గర దొరికే చికెన్ పకోడీ ఇదేనంట! - గుట్టు తెలిస్తే మత్తు దిగాల్సిందే!

అసలు సిసలైన ఆంధ్రా స్టైల్​ "నాటుకోడి వేపుడు" - ఈ పద్ధతిలో చేశారంటే తినేకొద్దీ తినాలనిపిస్తుంది!

సండే స్పెషల్​: టేస్టీ అండ్​ స్పైసీ "చికెన్​ ధమ్​ కిచిడి" - ఒక్కసారి తిన్నారంటే రుచి మర్చిపోరు! - Chicken Dum Khichdi in Telugu

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.