IRCTC Taste of Telangana Tour Package: ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ పలు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందుబాటు ధరలోనే ఈ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని చూసేందుకు వీలుగా ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీలో ఏఏ ప్రాంతాలు కవర్ అవుతాయి? ధర ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
IRCTC టేస్ట్ ఆఫ్ తెలంగాణ(Taste of Telangana) పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు యాదాద్రి, రామోజీ ఫిల్మ్ సిటీ కూడా దీనిలో కవర్ అవుతాయి. వీకెండ్‌లో ఏదైనా టూర్ ప్లాన్ చేసే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు ఉండే ఈ టేస్ట్ ఆఫ్ తెలంగాణ టూర్ ప్యాకేజీ మంగళవారం, శనివారం తప్పించి మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుంది.
ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను పికప్ చేసుకుని.. ముందుగానే బుక్ చేసిన హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్లో ఫ్రెషప్ తర్వాత చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్‌ను విజిట్ చేయవచ్చు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి భోజనంతో పాటు అక్కడే స్టే ఉంటుంది.
- రెండో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేశాక.. బిర్లా మందిర్, గోల్కొండ కోట సందర్శిస్తారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత అంబేడ్కర్ విగ్రహం సహా చుట్టు పక్కల ప్రదేశాలను విజిట్ చేస్తారు. సాయంత్రానికి హోటల్‌కి చేరి.. రాత్రి భోజనం చేసి, అక్కడే స్టే చేస్తారు.
- మూడో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం యాదాద్రికి బయలుదేరుతారు. అక్కడ నరసింహ స్వామి దర్శనం చేసుకుని సురేంద్రపురి సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్‌కి తిరిగి వచ్చి రాత్రికి హోటల్లో డిన్నర్ చేసి అక్కడే బస చేస్తారు.
- నాలుగో రోజు ఉదయం టిఫెన్ తిన్నాక.. రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్ ఉంటుంది. సాయంత్రం మళ్లీ హైదరాబాద్/సికింద్రాబాద్/కాచీగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
- ఒక్కరు లేదా ఇద్దరు, ముగ్గురు కలిసి వెళ్తే.. సింగిల్ షేరింగ్‌కి రూ. 30,390 ఛార్జ్ చేస్తారు. డబుల్ షేరింగ్‌కు రూ. 16,130, ట్రిపుల్ షేరింగ్ కోసం రూ. 12,610 నిర్ణయించారు. ఇక ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు విత్ బెడ్‌తో రూ. 8,350 నిర్ణయించారు.
- నలుగురు నుంచి ఆరుగురుకి.. డబుల్ షేరింగ్ అయితే రూ.13,080, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.11,410 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు రూ. 8,350 ఛార్జ్ చేస్తారు.
ప్యాకేజీలో కవరయ్యేవి..
- హైదరాబాద్‌లో ఏసీ వసతి సౌకర్యం కల్పిస్తారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు. లోకల్ ప్రయాణాలకు ఏసీ వాహనాన్ని అందిస్తారు. ట్రావెల్ ఇన్సురెన్స్ అందిస్తారు.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.