IPS TRANSFERS IN ANDHRA PRADESH: రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ బదిలీ అయ్యారు. ఎం రవి ప్రకాశ్ పీ అండ్ ఎల్ ఐజీగా బదిలీ అయ్యారు. పీహెచ్‌డీ రామకృష్ణను ఇంటెలిజెన్స్ ఐజీగా బదిలీ చేశారు. ఫకీరప్పను ఇంటెలిజెన్స్ ఎస్పీ గా బదిలీ చేశారు. ఆర్ ఎన్ అమ్మిరెడ్డికి డీజీపీ కార్యాలయంలో డీఐజీ అడ్మిన్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
సీహెచ్ విజయరావుకి రోడ్ సేఫ్టీ అథారిటీగా డీఐజీ పోస్టింగ్ ఇచ్చారు. సిద్ధార్ద్ కౌషల్‌కి శాంతి భద్రతల ఏఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. మేరీ ప్రశాంతిని విశాఖ శాంతి భద్రతల డీసీపీ2గా నియమించారు. తుహిన్ సిన్హాను అనకాపల్లి ఎస్పీగా, ఎం.దీపీకను ఏపీఎస్పీ 3 బెటాలియన్ కమాండెంట్‌గా, జి.రాధికకు ఒంగోలులోని పోలీసు ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
ఆరిఫ్ హఫీజ్‌కి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డిని పీటీఓ ఎస్పీగా నియమించారు. బాపూజీ అట్టాడను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కే. తిరుమలేశ్వర్ రెడ్డిని ఎన్టీఆర్ కమిషనరేట్‌లో క్రైమ్ డీసీపీగా, కేవీ శ్రీనివాసరావును పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.