ETV Bharat / state

రాష్ట్రానికి మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు - 9 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర - INVESTMENTS FOR AP

క్లీన్ ఎనర్జీ విధానంతో రాష్ట్రానికి బారులు తీరుతున్న సంస్థలు - 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

Investments_for_AP
Investments for AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 5:45 PM IST

Updated : Dec 30, 2024, 7:20 PM IST

INVESTMENTS FOR AP: రాష్ట్రంలో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో మరో 9 ప్రాజెక్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. వీటి ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్న సంస్థలకు భూకేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని సీఎం ఆదేశించారు. ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం స్పష్టం చేశారు.

భారత్ పెట్రోలియం భారీ పెట్టుబడి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన స్టేట్ ఇన్వెస్టర్స్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేసే 9 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 2,400 మందికి ఉపాధి కలుగనుంది.

ఏపీలోనూ "హైటెక్ సిటీ" నిర్మాణం - 2029 నాటికి 5లక్షల వర్క్​స్టేషన్లు : చంద్రబాబు

మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్ధ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మిస్తారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ.88,747 కోట్ల ఆదాయం రానుందని అధికారులు తెలిపారు. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.

విశాఖలో పెట్టుబడి పెట్టనున్న టీసీఎస్: విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యేలా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ సంస్థ రూ.1,046 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2,381 మందికి ఉపాధి కలుగుతుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో రూ.1,174 కోట్లతో 1,500 మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీఎఫ్ లేదా పర్టికల్ బోర్డు ప్లాంట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనుంది.

ఎన్టీపీసీ రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం

క్లీన్ ఎనర్జీ పాలసీతో భారీగా పెట్టుబడులు: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీతో పలు సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నాయి. కొత్తగా ఐదు సంస్థలు రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే రెండున్నల లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఏఎం గ్రీన్ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 592 ఎకరాల్లో 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమ్మోనియా మాన్యుఫాక్చరింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. రూ. 12,000 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉపాధి కలుగుతుంది.

జాన్ కోకిరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 40 ఎకరాల్లో 2 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ను రూ. 2,000 వేల కోట్లతో స్థాపించనుంది. దీంతో 500 మందికి ఉపాధి కలుగుతుంది. 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కర్నూలు జిల్లాలోని హోసూరు, పెద్ద హుల్తిలో 1,800 ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 1,380 మందికి ఉపాధి కలుగుతుంది. వైఎస్సాఆర్ జిల్లాలోని మైలవరం, కొండాపురం అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో 119 మెగావాట్ల విండ్ పవర్, 130 మెగావాట్ల సోలార్ హైబ్రీడ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.

650 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్రంలో తాజాగా 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర మంతటా 5 లక్షల ఎకరాల్లో రెండున్నర లక్షల మందికి ఉపాధి కలిగేలా 11 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తి కానుంది. దీని ద్వారా రాష్ట్రానికి రూ.4,095 కోట్ల ఆదాయం రానుంది. నవంబర్ 19న జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి సైతం ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రానికి రిలయన్స్ రాక - రూ.65వేల కోట్లతో పెట్టుబడుల ప్రణాళికలు

Last Updated : Dec 30, 2024, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.