ETV Bharat / state

అధిక వడ్డీ ఆశ చూపించారు - సొమ్ము చెల్లించాక బోర్డు తిప్పి ఉడాయించారు

Couple Investment Fraud in Uppal : పెట్టుబడి పేరుతో ఉప్పల్​కు చెందిన దంపతులు వేల మందిని మోసం చేశారు. దాదాపు రూ.2.5కోట్లతో ఉడాయించారు. ఆలస్యంగా గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Rs.2.5 Crore Investment Fraud in Uppal
Couple Commits Investment Fraud in Uppal
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 12:11 PM IST

Couple Investment Fraud in Uppal : తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలో భారీగా లాభాలు పొందవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్టు తిప్పేసిన ఘటన హైదరాబాద్​ ఉప్పల్​లో చోటుచేసుకుంది. రూ.కోట్లలో డబ్బు సమకూర్చుకొని తెర దించడంతో విషయం తెలుసుకున్న బాధితులు సోమవారం రోజున పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం : ఉప్పల్​ నల్ల చెరువు సమీపంలోని విమల నివాస్​లో సంవత్సరం కాలంగా స్థిరాస్తి సంస్థగా చెబుతూ జేవీ బిల్డర్స్​ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ ( మేనేజింగ్ డైరెక్టర్​), వేలూరి జ్యోతి దంపతులు ఓ సంస్థను నడిపిస్తున్నారు. ఇదే సంస్థను గతంలో బోడుప్పల్​, మేడిపల్లిలో నడిపించి అక్కడి నుంచి మార్చి ఉప్పల్​లో పెట్టారు.

JV Builders Fraud in Uppal Hyderabad : రకరకాల ఆకర్షణీయమైన స్కీములతో పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేశారు. రూ.10 లక్షలు పెడితే 15రోజులకు ఒకసారి రూ.20వేల వడ్డీతో పాటు అసలు రూ.లక్ష చొప్పున ఇస్తామని వినియోగదారులను నమ్మబలికారు. పెట్టుబడి పెట్టినవారికి మరింత నమ్మకం కలిగించేందుకు కొందరి పేరు మీద వ్యవసాయ, వ్యవసాయేతర భూములను కూడా రిజిస్ట్రేషన్​ చేశారు.

సైబర్ నేరగాళ్ల నయామోసం - లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు

అయితే పెట్టుబడులు పెట్టివారితో కొత్త సభ్యులను చేర్పిస్తే పెద్ద మొత్తంలోనే కమీషన్లు ఇస్తామని నమ్మించారు. ఇవన్నీ చూసి వేల మంది ఆకర్షితులై డబ్బులు చెల్లించారు. ఉప్పల్​ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు ఏకంగా రూ.18 లక్షలు పెట్టుబడిగా (Capital Frauds) పెట్టారు. సంస్థ నిర్వాహకులు ఏజెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా 500 మందికి పైగా ఏజెంట్లు తయారై వేలాది మందిని స్కీముల్లో చేర్పించారు. కొంతకాలం నిర్వాహకులు చెప్పిన విధంగా చెల్లింపులు చేయడంతో మరింత మంది ఆకర్షితులై సంస్థలో పెట్టుబడులు పెట్టారు.

Investment Fraud in Uppal Update : గత నెల రోజులుగా ఈ సంస్థ ఎవరికీ డబ్బులు చెల్లించండం లేదు. ఫోన్లు చేసినా నిర్వాహకులైన జ్యోతి, లక్ష్మీనారాయణ స్పందించడం లేదు. దీంతో 10 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము రూ.2.50 కోట్లు మోసపోయినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల సంఖ్య వేలల్లో, మోసపోయిన సోమ్ము కోట్లల్లో ఉందని వారు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏదైనా సంస్థలో పెట్టుబడులు పెట్టినప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలని బాధితులకు పోలీసులు సూచించారు. ఆ సంస్థ పూర్వోత్తరాలు పరిశీలించి అడుగు వేయాలని తెలిపారు.

రూ.1500 పెట్టుబడి పెడితే వంద రోజులపాటు రోజుకు రూ.50 - సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పోలీసులు

పెట్టుబడుల పేరిట 70 ఏళ్ల వృద్ధుడి నుంచి 22 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.