ETV Bharat / state

వైఎస్సార్​సీపీలో అసమ్మతి మంటలు- రాజీనామాలకైనా సిద్ధమంటున్న ప్రజాప్రతినిధులు

Dissension in YSRCP: నియోజకవర్గాల ఇంచార్జీల మార్పులు అధికార వైఎస్సార్​సీపీలో అంతర్గత అలజడులకు వేదిక అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు స్థానిక నేతను నమ్ముకుని పార్టీలో కొనసాగిన కార్యకర్తలు, కిందిస్థాయి నేతల్లో తీవ్ర అంతర్మథనం రేగుతోంది. కొత్త నేతల రాక, పెత్తనాలతో ఆగ్రహం పెల్లుబీకుతోంది. తమ అనుకూల నేతలకు టిక్కెట్లు ఇవ్వకపోతే, పార్టీకి రాజీనామ చేసేందుకు సిద్దమని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.

dissension_in_ysrcp
dissension_in_ysrcp
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 10:08 AM IST

Dissension in YSRCP: అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో సీట్ల మార్పులు - చేర్పులతో స్థానిక నేతల్లో ఆగ్రహం నెలకొంది. ఇది అసమ్మతిగా మారి పార్టీలో అలజడిని సృష్టిస్తోంది. తమ నాయకుడికి సీటు ఇవ్వకపోతే పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామంటూ కొందరు నేతలు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి సేవ చేసిన వారికి కాకుండా ఇతరులకు టికెట్‌ ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. ఎప్పట్నుంచో నమ్ముకున్న స్థానిక నేతకు టిక్కెట్టు ఇవ్వకుండా, ప్రతిపక్షాలను దూషించిన వారికే టిక్కట్లు ఇస్తామనడం సరికాదని నేతలు వాపోతున్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్​సీపీ సీట్ల కుంపటి తారస్థాయికి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్‌ను కాదని కొత్త ఇన్‌ఛార్జిగా దద్దాల నారాయణను అధిష్ఠానం నియమించింది. దీంతో పార్టీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎంపీటీసీలు, జడ్​పీటీసీలు, సర్పంచులతో పాటు మున్సిపల్‌ కౌన్సిలర్లు మధుసూదన్ యాదవ్‌కు మద్దతుగా పదవులకు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన మధుసూదన్ యాదవ్‌కు సీటు ఇవ్వకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీట్ల మార్పుపై వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం - కార్యకర్తలను కరివేపాకులా తీసివేస్తున్నారని అసహనం

"జగనన్నా ఏది ఆదేశిస్తే అదే పని చేసుకుంటూ వస్తున్నాము. కనిగిరి మున్సిపాలిటీలో 20 వార్డులు వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీనే గెలిచింది. దానికి మూల కారణం ఎమ్మెల్యే కృషి" - సుజాత, మున్సిపల్ కౌన్సిలర్, కనిగిరి

"గెలిచే గుర్రాన్ని పంపిస్తే మేము కూడా గుర్రాన్ని పరిగెత్తించగలం. కానీ, గెలిచేవారిని కాకుండా ఇష్టానుసారం ఎవర్ని పడితే వారిని పంపిస్తే ఏం చేయగలం." - వెంకటేశ్వర్లు, ఎంపీపీ,

ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిక - తర్వాత చెబుతానంటూ దాటవేత

ఇదే కోవలో కృష్ణాజిల్లా తిరువూరు సీటు ఇవ్వకపోవడంతో తన మనసు గాయపడిందని స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోటీ చేయడం ఖాయమని, ఎక్కడి నుంచి చేస్తానన్నది త్వరలో తెలిజేస్తానన్నారు. చంద్రబాబు, లోకేశ్​, పవన్‌కల్యాణ్‌లను దూషించకపోవడమూ తనకు సీటు ఇవ్వకపోవడానికి కారణం కావొచ్చన్నారు.

మంత్రి విశ్వరూప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురంలో వైఎస్సార్​సీపీకి అసమ్మతి సెగ పెరుగుతోంది. ఉప్పలగుప్తం గ్రామంలో నిర్వహించిన వైఎస్సార్​సీపీ కార్యకర్తలతో సమావేశంలో విశ్వరూప్‌పై దళిత నాయకుడు కుంచే రమణారావు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

అనేక కేసులతో ఇబ్బందులు పెట్టిన వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తే, తాము మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని బహిరంగ సమావేశంలో హెచ్చరించారు. ఇన్‌ఛార్జుల మార్పులు కొనసాగుతాయని వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ పెద్దలు స్పష్టం చేసిన నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటలు మరింతగా పెరిగే ప్రమాదముందని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.

గుండాటలో డబ్బులు పొగొట్టుకున్న ఎమ్మెల్యే! - రోడ్డు పక్కన జనంలో కలిసి మరీ

వైఎస్సార్​సీపీలో పెరుగుతున్న అసమ్మతి రాగాలు - రాజీనామాలకైనా సిద్ధమంటున్న ప్రజాప్రతినిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.